తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాశీ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారికి ఉరిశిక్ష - Terrorist Waliullah sentenced to death

ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​ కోర్టు సంచలన తీర్పు వెలువరిచింది. 2006 నాటి వారణాసి బాంబు పేలుళ్ల సూత్రధారి వలీఉల్లా ఖాన్‌కు మరణశిక్ష విధించింది. శనివారం అతడిని దోషిగా తేల్చిన కోర్టు.. సోమవారం శిక్షను ఖరారు చేసింది.

Waliullah
వలీఉల్లా ఖాన్‌

By

Published : Jun 6, 2022, 5:25 PM IST

2006 నాటి వారణాసి బాంబు పేలుళ్ల సూత్రధారి, ఉగ్రవాది అయిన వలీఉల్లా ఖాన్‌కు యూపీ గాజియాబాద్​ కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది. శనివారం జరిగిన విచారణలో వారణాసి బాంబు పేలుళ్లకు సంబంధించిన రెండు కేసుల్లో వలీఉల్లా ఖాన్‌ను దోషిగా నిర్ధరించింది కోర్టు. సోమవారం తీర్పును ఖరారు చేసింది. 2006 మార్చి 7న సంకట్ మోచన్ ఆలయం, కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ మారణ హోమంలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోగా.. 100 మందికి పైగా గాయపడ్డారు.

ఈ ఘటనకు సంబంధించి.. హత్య, హత్యాయత్నం, తీవ్రంగా గాయపరచడం, ఆయుధాలను అక్రమంగా వినియోగించడం తదితర నేరారోపణలతో వలీఉల్లా ఖాన్​పై అభియోగాలను మోపారు పోలీసులు. ఈ మేరకు రెండు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో పోలీసులు సరైన సాక్ష్యాధారాలు చూపడం వల్ల.. మరణశిక్షను విధించింది కోర్టు. మరో కేసులో పోలీసులు సరైన సాక్ష్యాధారాలు సమర్పించకపోవడం వల్ల.. వలీఉల్లా ఖాన్​ను నిర్దోషిగా తేల్చింది.

ABOUT THE AUTHOR

...view details