జమ్ముకశ్మీర్లో ఉగ్రముఠా గుట్టురట్టు చేశాయి భద్రతా బలగాలు. రియాసీ జిల్లాలో శుక్రవారం భారీ ఎత్తును మందుగుండు సామగ్రి, ఆయుధాలు, పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తనిఖీలు నిర్వహించగా..
జమ్ముకశ్మీర్లో ఉగ్రముఠా గుట్టురట్టు చేశాయి భద్రతా బలగాలు. రియాసీ జిల్లాలో శుక్రవారం భారీ ఎత్తును మందుగుండు సామగ్రి, ఆయుధాలు, పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తనిఖీలు నిర్వహించగా..
సిల్దార్ ఎగువ ప్రాంతాలు, రంజాటి, రౌసవాలి కొండ ప్రాంతాల్లో ముష్కరులు సంచరిస్తున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారంతో సీఆర్పీఎఫ్, ఆర్మీ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి. శుక్రవారం ఉదయం.. ఉగ్రవాదులకు చెందిన భూగర్భ రహస్య స్థావరాన్ని అధికారులు కనుగొన్నారు. రెండు మేగజైన్లతో ఉన్న ఏకే-47 రైఫిల్ సహా 150 మందు గుండ్లు, ఒక రాకెట్ లాంఛర్, 16 యూబీజీఎల్ గ్రెనేడ్లు, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లతో పాటు రేడియో సెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆయుధాలను సకాలంలో స్వాధీనం చేసుకోవడం ద్వారా దక్షిణ పిర్ పంజాల్ పర్వత శ్రేణుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడ్డుకోగలిగామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ ఘటనపై.. పేలుడు పదార్థాల చట్టం, ఇతర సంబంధిత చట్టాల కింద మహార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.