జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లాలో ఓ ఉగ్ర అనుచరుడిని అధికారులు అరెస్టు చేశారు. అతని నుంచి భారీగా ఆయుధాలు, నగదుతో సహా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పక్కా సమాచారంతో కుప్వారా పోలీసులు.. ఆర్మీకి చెందిన 17 ఆర్‌ఆర్, 160 టీఏలతో కలిసి క్రాల్‌పోరా రేషి గుండ్ వద్ద చెక్‌పాయింట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే తనిఖీ నిర్వహిస్తుండగా.. ఓ వ్యక్తి తప్పించుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. అతని నుంచి 12 గ్రనేడ్లు, ఏకే-47 తుపాకులు సహా రూ.1,69,500 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.