కశ్మీర్లో ఉగ్రదాడి- ఇద్దరు జవాన్లు మృతి - లావాయ్పురా ప్రాంతంలో ఉగ్రదాడి

కశ్మీర్లో ఉగ్రదాడి- ముగ్గురికి గాయాలు
16:07 March 25
కశ్మీర్లో సీఆర్పీఎఫ్ బలగాలపై ఉగ్రదాడి
జమ్ముకశ్మీర్ శ్రీనగర్ శివార్లలోని లావాయ్పురా ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో సీఆర్పీఎఫ్ జవాన్లు ఇద్దరు అమరులయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
గస్తీ విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు ఈ దాడికి తెగబడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
Last Updated : Mar 25, 2021, 6:51 PM IST