తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Termites Eat Money : బ్యాంక్​ లాకర్​లో 'చెదలు'.. రూ.18లక్షలు స్వాహా.. ఆమెకు ఆ విషయం తెలియదట! - ఉత్తర్​ప్రదేశ్​ బ్యాంక్​ లాకర్​లో చెదలు

Termites Eat Money In Bank Locker : బ్యాంక్​ లాకర్​లో ఓ మహిళ దాచిపెట్టిన రూ.18లక్షలను చెదలు స్వాహా చేశాయి. దీంతో మహిళ ఒక్కసారిగా షాక్​కు గురైంది. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిందీ ఘటన.

Termites Eat Money In Bank Locker
Termites Eat Money In Bank Locker

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2023, 11:18 AM IST

Termites Eat Money In Bank Locker :ఉత్తర్​ప్రదేశ్ మొరాదాబాద్​లోని బ్యాంక్​ లాకర్​లో ఓ మహిళ దాచిపెట్టిన రూ.18లక్షలు.. నల్లని మట్టిగా మారిపోయాయి! మొత్తం డబ్బును చెదలు ముక్కలుముక్కలుగా చేసేశాయి. దీంతో వాటిని చూసిన మహిళ షాక్​కు గురై బ్యాంక్ మేనేజర్​కు ఫిర్యాదు చేసింది.

అసలేం జరిగిందంటే?
మొరాదాబాద్.. రామగంగా విహార్‌లోని ఆషియానా కాలనీలో నివాసం ఉంటున్న అల్కా పాఠక్‌.. స్థానికంగా పరుపుల వ్యాపారం చేస్తోంది. ఆమెకు బ్యాంక్ ఆఫ్ బరోడా రామగంగా విహార్​ బ్రాంచ్‌లో ఖాతా ఉంది. కొన్నినెలల క్రితం ఇదే బ్యాంక్​లో ఆమె లాకర్​ తీసుకుంది. గతేడాది అక్టోబర్​ నెలలో అల్కా తన కుమర్తెకు వివాహం చేసింది. ఆ సందర్భంగా బంధుమిత్రులు డబ్బులు, నగల రూపంలో ఇచ్చిన కానుకలను లాకర్​లో భద్రపరిచింది. మొత్తం రూ.18లక్షలతో పాటు విలువైన నగలను లాకర్​లో ఉంచింది.

అయితే సెప్టెంబర్​ 25వతేదీన​ కేవైసీ, లాకర్​ అగ్రిమెంట్​ రెన్యువల్​ కోసం అల్కా.. బ్యాంక్​కు వెళ్లింది. ఆ సమయంలో లాకర్​ను తెరిచిన అల్కా.. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. డబ్బు నోట్లన్నింటినీ చెదలు తినేసి ఉండడం గమనించింది. వెంటనే బ్యాంక్​ మేనేజర్​కు విషయాన్ని చేరవేసింది. ఆయన వచ్చి చూడగా.. చెద పురుగుల దాడికి నోట్లు నల్లని మట్టి, ముక్కలుగా పడి ఉన్నాయి. అయితే నగలు భద్రంగానే ఉన్నట్లు బ్యాంక్ మేనేజర్​ తెలిపారు. కేసును విచారిస్తున్నట్లు చెప్పారు. బ్యాంక్​ లాకర్​లో డబ్బులు పెట్టకూడదని విషయం తనకు తెలియదని అల్కా చెప్పింది.

రూ.18లక్షలను స్వాహా చేసిన చెదలు

లాకర్ల గురించి ఈ 5 రూల్స్​ తప్పక తెలుసుకోండి!
Bank Locker New Rules 2023 :రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశం మేరకు బ్యాంకులు తమ లాకర్​ నిబంధనలను మార్పులు, చేర్పులు చేస్తున్నాయి. ఈ మేరకు కస్టమర్లకు కూడా సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇప్పటికే రివైజ్డ్​ లాకర్​ అగ్రిమెంట్​పైన సంతకం చేసినవారు, సప్లమెంటరీ అగ్రిమెంట్​పై కూడా సంతకం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి బ్యాంకులు. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్​బీఐ ఇప్పటికే తన కస్టమర్లకు సవరించిన బ్యాంక్​ లాకర్ రూల్స్​ గురించి, దాని సప్లమెంటరీ అగ్రిమెంట్​ గురించి సమాచారాన్ని అందిస్తోంది. బ్యాంక్​ ఆఫ్​ బరోడా కూడా ఇదే మార్గంలో పయనిస్తోంది. ఆర్​బీఐ నిర్దేశం మేరకు మిగతా బ్యాంకులు తప్పనిసరిగా ఈ మేరకు సమాచారం ఇవ్వాల్సి ఉంది. అయితే ఇందుకోసం 2023 డిసెంబర్​ నెలాఖరు వరకు సమయం ఉంది. రివైజ్డ్​ బ్యాంక్​ లాకర్ రూల్స్​​ విషయంలో ఆర్​బీఐ కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. అవేంటో తెలియాలంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details