10,12 తరగతుల ఫస్ట్ టర్మ్ బోర్డు పరీక్షలపై సీబీఎస్ఈ(cbse news today) కీలక ప్రకటన చేసింది. నవంబర్- డిసెంబర్లో ఆఫ్‌లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయని, అందుకు సంబంధించిన డేట్ షీట్ ఈ నెల 18న విడుదల చేయనున్నట్టు పేర్కొంది(cbse news today class 10).
90 నిమిషాల నిడివి గల పరీక్షలు.. ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయని సీబీఎస్ఈ తెలిపింది. ఉదయం 11:30కి పరీక్షలు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది.
కరోనా కారణంగా గతంలో.. 2021-22 విద్యాసంవత్సరానికి మార్పులు చేసింది సీబీఎస్ఈ. విద్యాసంవత్సరాన్ని రెండుగా విభజించి.. రెండు టర్మ్-ఎండ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే సిలబస్‌లోనూ మార్పులు చేసింది.