నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతన్నలతో కేంద్రం మరోసారి బుధవారం చర్చలు జరపనుంది. దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఇరు వర్గాల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. చట్టాల రద్దు తప్ప మరో అంశంపై చర్చించేది లేదని రైతు సంఘాలు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాయి. అన్నదాతలకు మద్దతిచ్చే వారిపై కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాయి.
హరియాణాలో 900 కేసుల నమోదుపై రైతుసంఘాలు నిరసన తెలిపాయి. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ముందుకు వెళ్లబోమన్న రైతులు విధాన నిర్ణయం తీసుకునే అంశం కేంద్రానిదేనని స్పష్టం చేశారు. చట్టాల రద్దుపై కమిటీ వేయాలని సుప్రీంకోర్టును తాము కోరలేదని రైతులు స్ఫష్టం చేశారు. చట్టాల రద్దుపై ప్రభుత్వంతో మాత్రమే చర్చిస్తామన్నారు.