తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పదోతరగతి ప్రశ్నపత్రం లీక్!.. పరీక్షలు యథాతథం

TENTH
TENTH

By

Published : Apr 3, 2023, 4:05 PM IST

Updated : Apr 4, 2023, 6:16 AM IST

16:00 April 03

పదోతరగతి పరీక్ష ప్రారంభమైన నిమిషాల్లోనే బయటకు వచ్చిన ప్రశ్నపత్రం

కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ప్రెస్ మీట్

Class 10 Exam Question Paper Leaked: వికారాబాద్‌ జిల్లా తాండూరులో సోమవారం పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం బయటకు రావడం కలకలం రేపింది. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా.. 9.37 గంటలకే సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నపత్రం చక్కర్లు కొట్టింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు బందెప్ప తన సెల్‌ఫోన్‌ నుంచి మరో ఉపాధ్యాయుడికి పంపడంతో పాటు ఓ వాట్సప్‌ గ్రూపులో పోస్ట్‌ చేసినట్లు పోలీసులు, విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఈ పాఠశాలలో మొత్తం 11 గదుల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. 11 మంది ఇన్విజిలేటర్లకు అదనంగా బందెప్పను రిలీవర్‌గా అందుబాటులో ఉంచారు. పాఠశాలలోని 5వ నంబరు గదిలో గైర్హాజరైన ఓ విద్యార్థికి సంబంధించిన ప్రశ్నపత్రాన్ని సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీసిన బందెప్ప.. తొలుత అదే మండలంలోని చెంగోల్‌ ప్రభుత్వ పాఠశాలలో సైన్స్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సమ్మప్పకు పంపాడు. ఆ తర్వాత ఓ వాట్సప్‌ గ్రూప్‌లోనూ పోస్ట్‌ చేశారు. ఆ వాట్సప్‌ గ్రూప్‌లో పొరపాటున పోస్ట్‌ చేసినట్టు గ్రహించి.. వెంటనే డిలీట్‌ చేశాడని పోలీసులు తెలిపారు. కానీ, అప్పటికే చాలామందికి ప్రశ్నపత్రం చేరిపోయింది....SPOT

VO2: గైర్హాజరైన విద్యార్థి ప్రశ్నపత్రమే.. పరీక్షా కేంద్రం నుంచి ప్రశ్నపత్రం బయటకు ఎలా వెళ్లిందనే అంశంపై అధికారులు విచారణ జరిపారు. ఆ కేంద్రంలో మొత్తం 260 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 258 మంది హాజరయ్యారు. ఇద్దరు గైర్హాజరయ్యారు. వారిలో ఓ విద్యార్థికి చెందిన ప్రశ్నపత్రాన్ని బందెప్ప సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి వాట్సప్‌ గ్రూపులో పంపించినట్లు అధికారులు గుర్తించారు. ఈ గ్రూపులో ఉపాధ్యాయులు, అధికారులు, పాత్రికేయులు సభ్యులుగా ఉన్నారు. ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టినట్లు వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి వెల్లడించారు. ఉపాధ్యాయులు బందెప్ప, సమ్మప్పలతోపాటు పరీక్షా కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ గోపాల్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారి శివకుమార్‌ సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. బందెప్ప, సమ్మప్పలపై క్రిమినల్‌ చర్యలుంటాయన్నారు. వాస్తవానికి పాఠశాలలోని 5వ నంబరు గదిలో ఇన్విజిలేటర్‌గా శ్రీనివాస్‌ అనే ఉపాధ్యాయుడు ఉన్నారు. బందెప్పకు ప్రశ్నపత్రం అందేలా అతను సహకరించినట్లు గుర్తించారు. అతన్ని ఇన్విజిలేషన్‌ విధుల నుంచి తప్పించినట్లు కలెక్టర్‌ తెలిపారు.

VO3: ప్రశ్నపత్రం బయటకు వచ్చిన అంశంపై పోలీసు, రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. పాఠశాలకు వెళ్లి బందెప్పను పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి, ఎస్‌ఐ వేణుగోపాల్‌గౌడ్, మండల విద్యాధికారి వెంకటయ్యగౌడ్, తహసీల్దార్‌ చిన్నప్పలనాయుడు సుమారు మూడు గంటల పాటు విచారించారు. బందెప్ప సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బయటకు పంపడం వెనుక ఉద్దేశమేంటి? మరో పాఠశాలలో సైన్స్‌ టీచర్‌గా పనిచేస్తున్న సమ్మప్ప తనకు ప్రశ్నపత్రాన్ని పంపాలని ముందుగానే చెప్పడంతో అతనికి బందెప్ప పంపినట్లు విచారణలో తేలినట్లు తెలిసింది. అందుకే బందెప్పతో పాటు సమ్మప్పలను సస్పెండ్‌ చేయడంతో పాటు వారిపై క్రిమినల్‌ చర్యలుంటాయని కలెక్టర్‌ ప్రకటించినట్లు భావిస్తున్నారు. తమ పాఠశాల విద్యార్థుల కోసమా? లేక తనకు తెలిసిన వారి పిల్లల కోసం ప్రశ్నపత్రాన్ని సమ్మప్ప తెప్పించుకున్నారా? అన్నది తేలాల్సి ఉంది. ‘వాట్సప్‌లో పంపింది బిట్‌ పేపర్‌ ఉండవని... సీసీఈ విధానమైనందువల్ల డైరెక్ట్‌ ప్రశ్నలు ఉండవని ఎందుకోసం తెప్పించుకున్నాడో విచారణలో తేలుతుంది’ అని విద్యాశాఖ ఆరా తీస్తోంది. 20 మార్కుల బిట్‌ పేపర్‌ని పరీక్ష జరిగే చివరి అరగంటలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో విద్యార్థులకు ఇస్తారు..SPOT

EVO: పదోతరగతి పరీక్షా కేంద్రాల్లోకి ఏ ఒక్కరూ సెల్‌ ఫోన్లను తీసుకురాకూడదని ఆదేశాలిచ్చిన విద్యాశాఖ విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులను తనిఖీ చేయాలని మాత్రం చెప్పలేదు. ఈ లొసుగును ఆసరగా చేసుకుని కొందరు సెల్‌ఫోన్‌ను యథేచ్చగా వాడుతున్నారు. ప్రస్తుత పేపర్‌ లీకేజీ ఘటనే ఇందుకు నిదర్శనం. క్రిమినల్‌ కేసు ఉన్న బందెప్పను పరీక్ష విధుల్లో తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఓ విద్యార్థిని వేధించినందుకు 2017లో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. అయినా విధుల్లోకి తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది.SPOT

అయితే అప్పటికే పరీక్ష ప్రారంభమై విద్యార్థులందరూ కేంద్రాల్లో ఉన్నందున.. ఇది లీక్ కాదని పాఠశాల విద్యా శాఖ చెబుతోంది. బందెప్ప చేసిన మాల్‌ ప్రాక్టీస్ మాత్రమేనని పాఠశాల విద్యా డైరెక్టర్ శ్రీదేవసేన పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో తప్పులు జరగలేదని కలెక్టర్ నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. తాండూరు ఘటన నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దన్నారు. మంగళవారం పరీక్ష యథాతథంగా కొనసాగుతుందని శ్రీదేవసేన స్పష్టం చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పదో తరగతి పరీక్షలకు 99.60శాతం విద్యార్థులు హాజరయ్యారు.

పదో తరగతి పరీక్ష యథాతథంగా నడుస్తాయి. నలుగురు ఉద్యోగులను కలెక్టర్ సస్పెండ్ చేశారు. చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్ గోపాల్ సస్పెన్షన్‌. ఇన్విజిలేటర్లు బందప్ప, సమ్మప్ప సస్పెన్షన్‌ అయ్యారు. పరీక్ష ప్రారంభమయ్యాక బందెప్ప ప్రశ్నపత్రం ఫొటో తీశారు. ఉ.9.37కు సమ్మప్పకు బందెప్ప ప్రశ్నపత్రం వాట్సాప్‌లో పంపారు. ఉపాధ్యాయుడు బందెప్ప మాల్‌ ప్రాక్టీస్ చేశారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి తప్పులు జరగలేదు.-శ్రీదేవసేన, విద్యాశాఖ డైరెక్టర్

ఇవీ చదవండి:

Last Updated : Apr 4, 2023, 6:16 AM IST

ABOUT THE AUTHOR

...view details