తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎమ్మెల్యేలను నిర్బంధించిన జర్నలిస్టులు- ఎందుకంటే? - జర్నలిస్టుల నిరసన

జర్నలిస్టుపై మహిళా పోలీస్ అధికారి దాడి చేయటంపై ఒడిశా కేంద్ర్​పాడా జిల్లాలోని జర్నలిస్టులు.. కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. కలెక్టర్​తో సమావేశం అయ్యేందుకు వచ్చిన ఐదుగురు ఎమ్మేల్యేలను రెండు గంటల పాటు కార్యాలయంలోనే నిర్బంధించారు. మహిళా పోలీస్​పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

journalists
జర్నలిస్టులు

By

Published : Jul 23, 2021, 12:12 PM IST

Updated : Jul 23, 2021, 1:01 PM IST

ఎమ్మెల్యేలను నిర్బంధించిన జర్నలిస్టులు

ఒడిశా.. కేంద్రపాడా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు నిరసనకు దిగారు. జర్నలిస్టుపై మహిళా పోలీస్ అధికారి దాడిచేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్​తో సమావేశమయ్యేందుకు వచ్చిన ఐదుగురు ఎమ్మేల్యేలను కూడా కార్యాలయంలోనే నిర్బంధించారు. మహిళా పోలీస్​పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్పీతో మాట్లాడి పోలీస్​ అధికారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యేలను వదిలేశారు.

ఎమ్మెల్యేలను నిర్బంధించిన జర్నలిస్టులు
ఎమ్మెల్యేలు నిర్బంధం

ఏం జరిగిందంటే..?

కేంద్ర్​పాడా జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు కొంతమంది భాజపా కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఆ దృశ్యాలను చిత్రీకరించేందుకు జర్నలిస్టు భీమ్​సేన్​ సేతి అక్కడకు వెళ్లాడు. అదే సమయంలో మహిళా కానిస్టేబుల్ పూనా నాయక్.. మాస్కు ధరించకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె చిత్రాలను తీసిన జర్నలిస్టు.. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్.. సేతిపై దాడి చేశారు ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

కలెక్టరేట్​ ముందు జర్నలిస్టుల ధర్నా

కానిస్టేబుల్​ పూనా.. ఇతర పోలీస్ అధికారులు, రాజకీయ నేతలు చూస్తుండగానే తనపై దాడి చేశారని సేతి తెలిపారు. ఆమెను వెంటనే సస్పెండ్​ చేయాలని, తనకు క్షమాపణ చెప్పించాలన్నారు.

ఇదీ చదవండి:'వాటర్​గేట్​ కుంభకోణం కంటే పెగాసస్​ దారుణం'

Last Updated : Jul 23, 2021, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details