తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీపీఎం కార్యాలయంపై బాంబు దాడి.. పోలీసులు హైఅలర్ట్​ - తిరువనంతపురం

Bomb Blast At CPM Office: కేరళ.. తిరువనంతపురంలో ఉన్న సీపీఎం ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ దుండగుడు.. బాంబు విసిరి పారిపోయాడని పోలీసులు తెలిపారు. కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​.. రాష్ట్రంలో పర్యటించనున్న వేళ ఈ ఘటన జరగడం చర్చలకు దారితీసింది.

Bomb Blast At CPI Office:
Bomb Blast At CPI Office:

By

Published : Jul 1, 2022, 9:38 AM IST

Updated : Jul 1, 2022, 1:54 PM IST

సీపీఎం కార్యాలయంపై బాంబు దాడి

AKG Center bomb blast : కేరళలోని తిరువనంతపురంలో ఉన్న సీపీఎం ప్రధాన కార్యాలయమైన ఏకేజీ సెంటర్​పై బాంబు దాడి జరిగింది. గురువారం జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో కేరళలో పోలీసులు హైఅలర్ట్​ ప్రకటించారు. వయనాడ్​లోని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ కార్యాలయంపై దాడి జరిగిన కొన్ని రోజులకు ఈ ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో ద్విచక్రవాహనంపైన వచ్చిన ఓ వ్యక్తి.. సీపీఎం ప్రధాన కార్యాలయం గేటుపై బాంబు విసిరి పరారయ్యాడు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. "ఏకేజీ సెంటర్​లోని మూడో అంతస్తులో నేను పనిచేసుకుంటున్నాను. రాత్రి 11:30 గంటల సమయంలో పెద్ద శబ్దం వినిపించింది. గేటు వద్ద పొగ అలుముకుంది. ఈ ఘటనను నేను ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఖండించాలి" అని సీపీఐఎం కేంద్ర కమిటీ సభ్యురాలు పీకే శ్రీమతి వెల్లడించారు.

రాహుల్​ పర్యటన వేళ..
Rahul Gandhi Kerala visit : రెండు రోజుల వయనాడ్​ పర్యటన కోసం కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ.. శుక్రవారం కేరళకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో బాంబు దాడి జరగడం చర్చల్లో నిలిచింది. గత వారం.. వయనాడ్​లోని రాహుల్​ కార్యాలయంపై దాడి జరిగింది. స్టూడెంట్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.

ఇవీ చదవండి:ఉద్ధవ్​ లెక్క తప్పిందెక్కడ? తారుమారు అవడానికి అదే కారణమా?

బ్రిటిషర్లకు వణుకు పుట్టించి.. విప్లవవీరుడు భగత్​సింగ్​కు స్ఫూర్తిగా నిలిచి..

Last Updated : Jul 1, 2022, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details