కరోనా వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతోంది. కొత్తగా 4,12,262 కేసులు నమోదు కాగా 3,980 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేంద్రం గురువారం ప్రకటన విడుదల చేసింది. మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్, దిల్లీ, కర్ణాటక, కేరళ, హరియాణా, బంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లలో ఎక్కువ కేసులు నమోదయ్యాని వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో 72.19 శాతం ఈ రాష్ట్రాల్లోనే నమోదైనట్లు స్పష్టం చేసింది. అత్యధికంగా మహారాష్ట్రలో 57,640 కేసులు నమోదయ్యాయి.
72 శాతం కేసులు ఆ పది రాష్ట్రాల్లోనే.. - కరోనా మహమ్మారి వార్తలు
దేశంలో కరోనా వ్యాప్తిపై కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో 72 శాతం.. మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్, దిల్లీ, కర్ణాటక, కేరళ, హరియాణా, బంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ల్లోనే నమోదవుతున్నట్లు కేంద్రం తెలిపింది.
కరోనా వైరస్
ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా తొమ్మిది రాష్ట్రాల్లో మరణాల సంఖ్య కూడా ఎక్కువ నమోదవుతోందని కేంద్రం పేర్కొంది. ఈ విషయంలో ఝార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది0 అని తెలిపింది. 920 మరణాలతో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది.
ఇదీ చదవండి :'ఉత్తర భారతాన్ని వణిస్తున్న బ్రిటన్ రకం వైరస్'