కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు కూడా నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో ఎక్కువ శాతం కేసులు మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్, దిల్లీ, కర్ణాటక, కేరళ, బిహార్, బంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నమోదయ్యాయి అని కేంద్రం శుక్రవారం వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో 71.81 శాతం ఈ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని పేర్కొంది.
మహారాష్ట్రలో అత్యధికంగా 62,194 కేసులు నమోదయ్యాయి. 49,058 కేసులతో కర్ణాటక.. 42,464 కేసులతో కేరళ ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. మరణాల సంఖ్యలో కూడా మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది. ఒక్క రోజే అత్యధికంగా 853 మంది ప్రాణాలు కోల్పోయారు.