Ten Cops Pocketing: మహారాష్ట్రలోని కొంత మంది పోలీసులు చేతివాటం ప్రదర్శించారు. రాష్ట్రంలోని ఠాణె జిల్లాలో ఓ వ్యాపారి ఇంటిపై దాడి జరిపి స్వాధీనం చేసుకున్న రూ.30 కోట్లలో రూ.6 కోట్లను పోలీసులు స్వాహా చేశారు. ఫిర్యాదు అందుకున్న అధికారులు.. ఈ ఘటనకు కారకులైన పది మంది పోలీసులను విధుల నుంచి తొలగించారు.
అసలు ఏం జరిగిందంటే.. ముంబ్రా పోలీసు స్టేషన్‌కు చెందిన పోలీసు బృందం.. ఏప్రిల్ 11న ఓ వ్యాపారి ఇంటిపై దాడి చేసి రూ.30 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. ఆ డబ్బును పోలీసు స్టేషన్‌కు తరలించింది. ఇక, ఆ సొమ్ముపై పది మంది పోలీసులు కన్నేశారు. ఆ వ్యాపారితో డీల్ కుదుర్చుకున్నారు. రూ.6 కోట్లు చెల్లిస్తే మిగతా రూ.24 కోట్లు ఇస్తామని చెప్పారు. అందుకు ఆ వ్యాపారి రూ.2 కోట్లు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఆ పోలీసులు మాత్రం రూ. 24 కోట్లు ఆ వ్యాపారికి తిరిగి ఇచ్చారు. వెంటనే అతడు ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. స్పందించిన అధికారులు పది మంది రక్షక భటుల్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన పోలీసుల్లో ఒక ఇన్‌స్పెక్టర్, ఇద్దరు సబ్-ఇన్‌స్పెక్టర్లు, ఏడుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. ఈ ఘటనపై డీఐజీ తదుపరి విచారణను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
సీజ్ చేసిన డబ్బుపై చేతివాటం.. 10 మంది పోలీసులు సస్పెండ్ - మహారాష్ట్ర పోలీసులు
Maharastra Police News: ఓ వ్యాపారి ఇంటిలో స్వాధీనం చేసుకున్న సొమ్ముపై మహారాష్ట్ర పోలీసులు చేతివాటం ప్రదర్శించారు. స్టేషన్లో ఉన్న ఆ సొమ్ములో రూ.6 కోట్లను స్వాహా చేసి మిగతా సొమ్మును డీల్ ప్రకారం వ్యాపారికి అందించారు. ఆ వ్యాపారి ఫిర్యాదు అందుకున్న ఉన్నతాధికారులు ఆ పది మంది పోలీసులను సస్పెండ్ చేశారు.
ten-cops-suspended