తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేవాలయాలు కట్టిస్తున్న ముస్లిం.. ప్రజలంతా అన్నదమ్ముల్లా ఉండాలని ఆకాంక్ష - కర్ణాటక రామనగర న్యూస్

హిందూ-ముస్లింలు చివరి వరకు సోదరభావంతో కలిసి ఉండడమే ఆయన కోరిక! అందుకే పలు దేవాలయాలను నిర్మించి మతసామరస్యాన్ని చాటుతున్నారు. ఆయనే కర్ణాటకకు చెందిన సయ్యద్ ఉదత్ సకఫ్. తాజాగా మరో మందిరాన్ని నిర్మించారు.

TEMPLE WAS BUILT BY A MUSLIM MAN
దేవాలయం

By

Published : Sep 13, 2022, 11:03 AM IST

కర్ణాటకలోని రామనగరలో మతసామరస్యాన్ని చాటుతున్నారు సయ్యద్ సదత్ ఉల్లా సకఫ్ అనే వ్యక్తి. చన్నపట్టణకు చెందిన ఆయన.. తన సొంత డబ్బుతో బసవేశ్వర ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఆలయ ఆవరణలోనే మసీదును నిర్మించారు. హిందూ- ముస్లింలు సోదర భావంతో మెలగాలని సయ్యద్​ కోరుతున్నారు.

.
స్థానిక ముస్లిం నేత అయిన సయ్యద్ అన్ని మతాలను గౌరవిస్తున్నారు. ఆయన​కు హిందువులంటే చాలా అభిమానం. ప్రజలంతా ఇతర మతాల పట్ల సామరస్యంతో ఉండాలనే ఉద్దేశంతో 2010లోనే వీరభద్ర స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని స్వర్గీయ సిద్దగంగ శ్రీ డాక్టర్ శివకుమార స్వామీజీ ప్రారంభించారు. ఇప్పుడు బసవేశ్వర ఆలయాన్ని నిర్మిస్తున్నారు సయ్యద్. ఆలయ నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వీరభద్ర ఆలయం మాదిరిగానే బసవేశ్వర మందిర ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తానని చెబుతున్నారు.
.

కాగా, చన్నపట్టణంలో ప్రజలు కలిసిమెలిసి పండగలు జరుపుకొంటున్నారు. హిందూ దేవాలయంలో జరిగే జాతరకు.. ముస్లింలు తరలిరావడం ీ గ్రామం ప్రత్యేకత. అదేవిధంగా ముస్లింలు నిర్వహించే గంధ మహోత్సవానికి హిందువులు వెళ్తారు. కాబట్టి, ఈ గ్రామాన్ని హిందూ-ముస్లిం ఆధ్యాత్మికత గ్రామంగా పిలుస్తారు. అంతే కాకుండా సయ్యద్.. గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినవారికి విరాళాలు ఇస్తారు. హిందువులు- ముస్లింలు చివరి వరకు అన్నదమ్ముల్లా ఉండాలన్నదే తన కోరికని సయ్యద్ చెబుతున్నారు.

దేవాలయ పనులను పర్యవేక్షిస్తున్న సయ్యద్

ABOUT THE AUTHOR

...view details