Ram Temple Sold By Pakistani: పాకిస్థాన్ జాతీయుడు ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లోని రామ్‌జానకి దేవాలయాన్ని విక్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు మరో ఆస్తిని విక్రయించినట్లు కాన్పూర్ అధికారులు వెల్లడించారు. దీనిపై స్పందించిన శత్రు ఆస్తుల నిర్వహణ విభాగం అధికారులు.. వాటిని శత్రు ఆస్తులుగా ప్రకటించారు. ఆలయాన్ని కొనుగోలు చేసి కూల్చివేసి హోటల్‌ను నిర్మించిన వారికి నోటీసులు జారీచేసినట్లు అధికారులు తెలిపారు. తాము అడిగిన ఐదు నిర్దిష్ట ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు రెండు వారాల సమయం ఇచ్చామన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి స్పందన రాలేదని శత్రు ఆస్తుల విభాగం అధికారులు తెలిపారు.
యూపీలో రాముని గుడిని అమ్మిన పాకిస్థానీ
Ram Temple Sold By Pakistani: ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లోని రామ్‌జానకీ దేవాలయాన్ని విక్రయించాడు ఓ పాకిస్థాన్ జాతీయుడు. అక్కడ నివసిస్తున్న 18 హిందూ కుటుంబాలను తరలించాడు. దీనిపై స్పందించిన అధికారులు దానిని శత్రు ఆస్తులుగా ప్రకటించారు.
పాకిస్థాన్ కుటుంబానికి చెందిన అబిద్ రెహ్మాన్ 1962లో ఆ దేశానికి వలస వెళ్లాడు. తర్వాత 1982లో తిరిగి వచ్చి కాన్పూర్ బెకాన్‌గంజ్‌లోని తన ఆస్తిని సైకిల్ షాప్ నిర్వహించే ముఖ్తార్ బాబాకు విక్రయించాడు. దీంతో ఆస్తిని కొన్న ముఖ్తార్ అక్కడ నివసిస్తున్న 18 హిందూ కుటుంబాలను అక్కడి నుంచి తరలించి.. ఓ హోటల్‌ను నిర్మించాడు. కాగా కాన్పూర్ మున్సిపల్ కార్పోరేషన్ రికార్డుల ప్రకారం ఆస్తి.. ఆలయంగా నమోదు అయ్యింది. ఈ విషయంపై గతేడాది శత్రు సంఘర్షణ సమితి అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో దీనిపై విచారణ చేపట్టాలని జాయింట్ మేజిస్ట్రేట్‌ను ఆదేశించారు జిల్లా మేజిస్ట్రేట్. దీనిపై స్పందించిన ముఖ్తార్ బాబా కుమారుడు మహ్మద్ ఉమర్.. తన వద్ద ఆస్తి పత్రాలు ఉన్నాయని.. అధికారుల ప్రశ్నలకు త్వరలోనే సమాధానం ఇస్తానని చెప్పారు.
ఇదీ చదవండి:దేశ విభజన ఆగినట్లే ఆగి.. నెహ్రూ రాకతో తలకిందులై..!