తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ. 526 కోట్ల విరాళానికి నిధులెక్కడివి? - ఆలయానికి రూ.500 కోట్ల విరాళం

ఆలయానికి భూరి విరాళం ప్రకటించిన వజ్రాల వ్యాపారిని కేరళ ఆలయ పాలక మండలి ప్రశ్నించింది. బెంగళూరుకు చెందిన వజ్రాల వ్యాపారి గాన శ్రవణ్‌... కేరళ రాష్ట్రం కొచ్చిన్‌లోని చొట్టనిక్కర్‌ భగవతి ఆలయానికి గత నవంబరులో రూ.526 కోట్ల విరాళం ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Chottanikkara Temple
రూ. 526 కోట్ల విరాళానికి నిధులెక్కడివి?

By

Published : Feb 28, 2021, 7:02 AM IST

ఓ వజ్రాల వ్యాపారి కేరళలోని ఆలయానికి మూడు నెలల క్రితం భూరి విరాళం ప్రకటించారు. అయితే ఈ నిధుల్ని వినియోగించేముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆలయ పాలక మండలి నిర్ణయించింది. దాతను సంప్రదించగా వివరాలు సమర్పణకు గడువు కావాలని కోరినట్లు తెలిసింది. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో చర్చనీయాంశమైంది.

బెంగళూరుకు చెందిన వజ్రాల వ్యాపారి గాన శ్రవణ్‌ కేరళ రాష్ట్రం కొచ్చిన్‌లోని చొట్టనిక్కర్‌ భగవతి ఆలయానికి గత నవంబరులో రూ.526 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఆ నిధులు ఎలా వచ్చాయో తెలపాలని ఆలయ పాలకమండలి ఇటీవల కోరింది. బెంగళూరు సమీపంలోని చిక్కబళ్లాపుర తాలూకా చింతామణికి చెందిన తాను వజ్రాల వ్యాపారం చేస్తుంటానని, గతంలో తీవ్ర కష్టాల్లో ఉన్న తనను ఈ ఆలయాన్ని సందర్శించాల్సిందిగా ఒకరు సూచించడంతో 2016లో వచ్చానని శ్రవణ్‌ పేర్కొన్నారు. ఆలయాన్ని సందర్శించిన తర్వాత వ్యాపారంలో అమితంగా సంపాదిస్తున్నట్లు తెలిపారు. ఈ కారణంగానే పెద్దమొత్తంలో విరాళాన్ని ప్రకటించినట్లు చెప్పారు. 60 రోజుల్లో పూర్తి వివరాలు సమర్పిస్తానని పేర్కొన్నట్లు సమాచారం. కేరళకు చెందిన దేవాదాయ మంత్రిత్వ శాఖ కూడా పూర్తి వివరాల్ని తెలుసుకున్న తరువాతనే ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది.

ఇదీ చదవండి:వ్యాధులే కాదు... ఔషధాలూ అరుదే!

ABOUT THE AUTHOR

...view details