Temperature Drop in Northern States: ఉత్తరాదిలో రోజురోజుకు చలితీవ్రత పెరిగిపోతోంది. క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం ఈ తీవ్రత మరీ ఎక్కువగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. రహదారులు, రైల్వేట్రాకులను కమ్మేస్తున్న పొగమంచు వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, దిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్ఠస్థాయికి పడిపోయాయి.
చలిపులి.. వణుకుతున్న ఉత్తర భారతం - హిమాచల్ ప్రదేశ్లో చలి తీవ్రత
Temperature Drop in Northern States: దేశంలో రోజురోజుకు చలితీవ్రత పెరుగిపోతోంది. ముఖ్యంగా.. ఉత్తరాది రాష్ట్రాలపై పంజా విసురుతోంది. ఆయా రాష్ట్రాల్లో ఉదయాన్నే రహదారులను పొంగమంచు కమ్మేస్తోంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు స్థానికులు సైతం చలిమంటలతో తమ రోజును ప్రారంభిస్తున్నారు.
![చలిపులి.. వణుకుతున్న ఉత్తర భారతం temperatures drop](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13940626-thumbnail-3x2-cold.jpg)
చలి