తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వేదాలను తెలుగులోకి అనువదించిన హైదరాబాద్​ రచయిత.. 4వేల పేజీలు.. 28 కిలోల బరువు.. - rishi fair ajmer rajasthan

25 ఏళ్ల పాటు కష్టపడి నాలుగు వేదాలను తెలుగులోకి అనువదించారు హైదరాబాద్​కు చెందిన ఓ రచయిత. నాలుగు వేల పేజీలు గల ఈ పుస్తకాన్ని రాజస్థాన్​లోని అజ్మేర్​లో జరిగిన రిషి ఫెయిర్​లో ప్రదర్శించారు. ఓ సారి ఆ పుస్తక విశేషాలెేంటో తెలుసుకుందాం.

Divya Veda Vani Book
దివ్యవేదవాణి బుక్

By

Published : Nov 6, 2022, 10:00 PM IST

యజుర్వేదం, సామవేదం, బుగ్వేదం, అదర్వణ వేదాల్లోని మంత్రాలను తెలుగులోకి అనువదించారు హైదరాబాద్​కు చెందిన డాక్టర్ మర్రి కృష్ణారెడ్డి. రాజస్థాన్​లోని అజ్మేర్​లో జరిగిన రిషి ఫెయిర్​లో 'దివ్య వేద వాణి' పుస్తకాన్ని ప్రదర్శించారు. మర్రి కృష్ణారెడ్డి గత 25 ఏళ్లుగా కష్టపడి ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. ఎక్కువ పేజీలు, బరువు కారణంగా 'హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌'లో ఈ పుస్తకం చోటు దక్కించుకుందని ఆయన తెలిపారు.

దివ్యవేదవాణి బుక్

"దివ్యవేదవాణి పుస్తకం బరువు 28 కేజీలు. ఇందులో 4,104 పేజీలు ఉన్నాయి. 1996లో దివ్య వేద వాణి పుస్తకాన్ని రాయడం ప్రారంభించాను. 2019 నాటికి పుస్తకం రాయడం పూర్తైంది. కొవిడ్ వల్ల కొంత ఆలస్యమైంది. నా గురువు గోపాదేవ్ శాస్త్రి దగ్గర సంస్కృతం, వేదాలను నేర్చుకున్నాను. ఈ బుక్​ను పలువురు ప్రముఖులకు అందించాను."

ABOUT THE AUTHOR

...view details