తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆహార భద్రత సూచీలో అట్టడుగున తెలుగు రాష్ట్రాలు​ - food safety ap

ఆహార భద్రత సూచిక(2021-22)లో తెలుగు రాష్ట్రాలు చివరి స్థానాల్లో నిలిచాయి. భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ ప్రకటించిన పెద్ద రాష్ట్రాల ర్యాంకుల్లో తెలంగాణ 15, బిహార్‌ 16, ఆంధ్రప్రదేశ్‌ 17వ స్థానాల్లో ఉన్నాయి.

telugu states stood bottom in food safety index
ఆహార భద్రత సూచీలో అట్టడుగున ఆంధ్రప్రదేశ్​

By

Published : Jun 9, 2022, 5:16 AM IST

ఆహార భద్రత సూచిక-2021-22లో తెలుగు రాష్ట్రాలు చివరి స్థానాల్లో నిలిచాయి. భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ 20 పెద్ద రాష్ట్రాలకు ర్యాంకులు ప్రకటించగా, తెలంగాణ 15, బిహార్‌ 16 , ఆంధ్రప్రదేశ్‌ 17వ స్థానాల్లో నిలిచాయి. మొత్తం 5 కొలమానాల్లో 100 మార్కులకు గాను.. తమిళనాడు 82, గుజరాత్‌ 77.5, మహారాష్ట్ర 70 మార్కులతో తొలి మూడు స్థానాలు దక్కించుకున్నాయి.

తెలంగాణ 34.5, బిహార్‌ 30, ఆంధ్రప్రదేశ్‌ 26 మార్కులతో చివరిస్థానాలకు పరిమితమయ్యాయి. బంగాల్‌- మధ్యప్రదేశ్ కలిపి ఐదో స్థానం, ఒడిశా-ఉత్తర్‌ప్రదేశ్‌లు 8వ స్థానం, హరియాణా-చత్తీస్‌గఢ్‌ 13వ ర్యాంకుల్లో నిలవడంతో 20 రాష్ట్రాలకు కలిపి 17 ర్యాంకులే వచ్చాయి. 2020-21లో తెలంగాణ 49, ఏపీ 36 మార్కులు సాధించాయి. ఇదివరకు చివరన ఉన్న బిహార్‌ ఈ సారి ఒక మెట్టు పైకి ఎక్కగా అక్కడున్న ఏపీ ఇప్పుడు చిట్టచివరికి చేరింది.

ABOUT THE AUTHOR

...view details