TS Tenth Results 2023 : తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలనుwww.eenadu.netలో చూడొచ్చు. గత నెల 3 నుంచి 13 వరకు జరిగిన పరీక్షలకు 2 లక్షల 49 వేల 747 బాలురు.. 2 లక్షల 44 వేల 873 మంది బాలికలు కలిపి మొత్తం 4 లక్షల 94 వేల 620 మంది విద్యార్థులు హాజరయ్యారు.
TS SSC Results 2023 : పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ చెక్ చేసుకోండిలా.. - తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
![TS SSC Results 2023 : పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ చెక్ చేసుకోండిలా.. TS Tenth Results](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/1200-675-18466580-297-18466580-1683699909000.jpg)
11:43 May 10
TS Tenth Results 2023 : పదో తరగతి ఫలితాలు విడుదల
86.6 శాతం ఉత్తీర్ణత నమోదు..: పదో తరగతి ఫలితాల్లో 86.6 శాతం ఉత్తీర్ణత నమోదైంది. టెన్త్ ఫలితాల్లో బాలికలు 88.53 శాతం, బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మొత్తం 4 లక్షల 91 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 4 లక్షల 19 వేల మంది ఉత్తీర్ణులైనట్లు మంత్రి పేర్కొన్నారు. 2,793 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఒక్క విద్యార్థీ పాస్ కాని పాఠశాలలు 25 ఉన్నాయని మంత్రి సబిత స్పష్టం చేశారు.
నిర్మల్ ఫస్ట్.. వికారాబాద్ లాస్ట్: పది ఫలితాల్లో 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా అగ్రస్థానంలో నిలవగా.. 59.46 శాతం ఉత్తీర్ణతతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. 7,492 మంది విద్యార్థులు ప్రైవేటుగా పరీక్షలు రాయగా.. వారిలో 44.51 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. జూన్ 14 నుంచి 22 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలుంటాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ నెల 26 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువు ఉందన్నారు.
ఇవీ చదవండి: