తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజేంద్రనగర్​లో 100 ఎకరాల్లో నూతన హైకోర్టు - జనవరిలో శంకుస్థాపన ఏర్పాట్లకు సీఎం ఆదేశాలు - తెలంగాణ నూతన హైకోర్టు శంకుస్థాపన

Telangana New High Court Building in Rajendra Nagar : జనవరిలో హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఆదేశించారు. రాజేంద్ర నగర్​లో 100 ఎకరాల్లో నిర్మాణానికి ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. హైకోర్టు నూతన భవనం నిర్మించాలన్న హైకోర్టు సీజే కోరిక మేరకు సీఎం రేవంత్​ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Telangana New High Court Building
Telangana New High Court Building in Rajendra Nagar

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2023, 10:33 PM IST

Updated : Dec 14, 2023, 10:49 PM IST

Telangana New High Court Building in Rajendra Nagar : ప్రస్తుత హైకోర్టు శిథిలావస్థకు చేరుకున్నందున రాజేంద్రనగర్‌లో వంద ఎకరాల్లో హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ అరాధే(Justic Alok Aradhe) సమావేశం అయ్యారు. ఎంసీఆర్​హెచ్‌ఆర్‌డీలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్​తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ముగిసిన మంత్రివర్గ సమావేశం - గవర్నర్​ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం

హైకోర్టు శిథిలావస్థకు చేరుకుంది : రాష్ట్రంలోని న్యాయస్థానాల స్థితిగతులు, వసతులు తదితర అంశాలపై ఈ సమావేశం చర్చించారు. ప్రధానంగా ఇప్పుడున్న హైకోర్టు(Telangana High Court) శిథిలావస్థకు చేరుకున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ ఆరాధే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన సీఎం ఎక్కడ వంద ఎకరాలకంటే ఎక్కువ ప్రభుత్వ స్థలం ఉందో అధికారులతో ఆరా తీశారు. రాజేందర్‌ నగర్‌ ప్రాంతంలో ఉందని అధికారులు తెలియచేయడంతో అక్కడ భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

జనవరిలో నూతన హైకోర్టుకు శంకుస్థాపన : అదేవిధంగా జనవరిలో శంకుస్థాపన చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్​ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కొత్త జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్​ల(District Court Complex) నిర్మాణానికి కూడా చొరవ చూపాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆరాధే సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లు నిర్మాణాలు అవసరం అవుతాయో ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

ప్రజాదర్బార్​కు విశేష స్పందన- సేవను మించిన తృప్తి లేదంటూ సీఎం ఎమోషనల్​ ట్వీట్

Telangana CM order to New Telangana High Court Building : ఇప్పుడున్న హైకోర్టు భవనం హెరిటెజ్ బిల్డింగ్(Telangana High Court Heritage Builing) అయినందున దానిని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని కూడా సీఎం గుర్తు చేశారు. ఆ భవనాన్ని రినోవేషన్ చేసి సిటీ కోర్టుకు లేదా ఇతర కోర్టు భవనాలకు వినియోగించుకునేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా రేవంత్​ రెడ్డి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి సమీక్షలతో బిజీగా ఉన్నారు. అన్ని శాఖలను సమీక్షిస్తూ పాలనను గాడి పెట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు. అలాగే ఎంసీహెచ్​ఆర్డీలో ఖాళీ స్థలంలో సీఎం క్యాంపు ఆఫీసు నిర్మిస్తామని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. ఎలాంటి కొత్త భవనాలను కట్టకుండా ఉన్న శాసనసభ భవనాలనే వాడుకుంటామని, అలాగే కొత్త కార్లు కొనుగోలు చేయమని అన్నారు.

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదీలీలు - ఆమ్రపాలికి కీలక బాధ్యతలు

ఎంసీఆర్​హెచ్ఆర్డీలోని ఖాళీ ప్రాంగణంలో సీఎం క్యాంప్‌ కార్యాలయం : రేవంత్‌ రెడ్డి

Last Updated : Dec 14, 2023, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details