తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Jubilee Hills gang rape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం.. ఆ తీర్పు కొట్టివేత

Jubilee Hills gang rape
Jubilee Hills gang rape

By

Published : Apr 25, 2023, 12:51 PM IST

Updated : Apr 25, 2023, 2:21 PM IST

12:42 April 25

Jubilee Hills gang rape: పోక్సో కోర్టు తీర్పును కొట్టివేసిన హైకోర్టు

Jubilee Hills Gang Rape Case Latest Updates: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరో నిందితుడిగా ఉన్న మైనర్‌ను మేజర్‌గా పరిగణించాలంటూ పోక్సో కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టి వేసింది. ప్రస్తుతం ఈ కేసులో ఉన్న నిందితుల్లో నలుగురు మేజర్లు కాగా.. ఇద్దరు మైనర్లు ఉన్నారు.

Jubilee Hills Gang Rape Case Latest news : గతేడాది మే నెలలో జూబ్లీహిల్స్‌లో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఐదుగురు మైనర్లుగా గుర్తించారు. వారిని మేజర్లుగానే పరిగణిస్తామంటూ పోక్సో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తీవ్రమైన కేసులో మైనర్లను మేజర్లుగా పరిగణించాలని కోరారు. విచారించిన నాంపల్లి కోర్టు నలుగురిని మేజర్లుగా పరిగణించాలంటూ తీర్పు వెలువరించింది. మరో మైనర్‌పై మాత్రం అభియోగాలు తీవ్రంగా లేనందున.. అతడిని మైనర్‌గానే పరిగణించింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ నిందితుల్లోని ఓ మైనర్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. పోక్సో కోర్టు తీర్పును కొట్టివేసింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులు మేజర్లుగా.. ఇద్దరు నిందితులు మైనర్లుగా ఉన్నారు.

అసలేం జరిగిందంటే: గతేడాది మే 28న ఓ మైనర్ జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. మూడు రోజుల తర్వాత బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకుని బాలిక వాంగ్మూలం సేకరించిన జూబ్లీహిల్స్​ పోలీసులు.. విడతల వారీగా సాదుద్దీన్​తో పాటు మరో ఐదుగురు మైనర్లను అరెస్ట్ చేశారు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు.. తీవ్రంగా శ్రమించి తగిన ఆధారాలు సేకరించారు. నిందితులు నేరం చేసినట్టు నిరూపించేందుకు కావాల్సిన అన్ని సాక్ష్యాలను సేకరించగా.. అందులో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. తగిన సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులు.. కేసుకు సంబంధించి నేరాభియోగపత్రం దాఖలు చేశారు.

ఈ కేసులో కీలక ఆధారాల కోసం.. అత్యాచారం చేసిన వాహనంలో దొరికిన వెంట్రుకలు, నాప్‌కిన్‌లు, వీర్యం నమూనాలు, తిని పారేసిన చూయింగమ్‌లను ఫొరెన్సిక్‌ అధికారులు సేకరించారు. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన రోజు ఆమె వేసుకున్న దుస్తులపై మైనర్ బాలుర డీఎన్ఏను ఎఫ్ఎస్ఎల్ అధికారులు గుర్తించారు. బాలిక దుస్తులపై దొరికిన నమూనాలు, కారులో లభ్యమైన ఆధారాలతో నిందితుల డీఎన్ఏ సరిపోలినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఈ ఒక్క కీలక ఆధారంతో.. అత్యాచారం వాల్లే చేశారనడానికి పోలీసులకు సరైన సాక్ష్యం దొరికినట్టైంది. ఫోరెన్సిక్​ అధికారుల ఇచ్చిన నివేదిక వివరాలను పోలీసులు ఛార్జిషీట్‌లో పొందుపరిచారు.

ఇవీ చూడండి..

జూబ్లీహిల్స్‌ అత్యాచారం కేసులో ఛార్జ్​షీట్‌ దాఖలు.. పకడ్బందీగా సాక్ష్యాలు..!

జూబ్లీహిల్స్​ అత్యాచారం కేసు.. అప్పటి నుంచి ఇప్పటిదాకా...

Last Updated : Apr 25, 2023, 2:21 PM IST

ABOUT THE AUTHOR

...view details