తెలంగాణ

telangana

ETV Bharat / bharat

TS Highcourt Notices to RBI Governor : ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తి కాంతదాస్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు - కోర్టు ధిక్కరణ కేసులో ఆర్​బీఐ గవర్నర్​కు నోటీసులు

RBI Governor
RBI Governor

By

Published : Jun 19, 2023, 9:46 PM IST

Updated : Jun 19, 2023, 10:06 PM IST

21:43 June 19

TS Highcourt Notices to RBI Governor : ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తి కాంతదాస్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

Telangana High Court notices to RBI Governor : కోర్టు ధిక్కరణ కేసులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో జులై 7లోగా వివరణ ఇవ్వాలని ఆర్బీఐ గవర్నర్‌ను హైకోర్టు ఆదేశించింది. మహేశ్ బ్యాంకు పాలకవర్గ ఎన్నికల వివాదంపై బ్యాంకు షేర్ హోల్డర్ల అసోసియేషన్ గతంలో హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు బ్యాంకు రోజువారీ లావాదేవీల నిర్వహణ కోసం ఓ అధికారిని నియమించాలని ఆర్బీఐ గవర్నర్‌ను హైకోర్టు ఏప్రిల్‌లో ఆదేశించింది. అయితే హైకోర్టు ఉత్తర్వులు అమలు కావడం లేదంటూ మహేశ్​ బ్యాంకు షేర్ హోల్డర్ల సంక్షేమ సంఘం కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. కోర్టు ఉత్తర్వులు ఎందుకు అమలు కాలేదో వివరణ ఇవ్వాలని శక్తికాంతదాస్‌కు నోటీసులు జారీ చేసి విచారణను జులై 7కి వాయిదా వేసింది.

ఇవీ చదవండి :

Last Updated : Jun 19, 2023, 10:06 PM IST

ABOUT THE AUTHOR

...view details