తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Viveka Murder Case Sunil Yadav Bail Denied: వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్‌కు బెయిల్‌ నిరాకరణ - Viveka Murder Case

Viveka Murder Case Sunil Yadav Bail Denied
Viveka Murder Case Sunil Yadav Bail Denied

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 11:36 AM IST

Updated : Sep 15, 2023, 1:00 PM IST

11:32 September 15

సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

Viveka Murder Case Sunil Yadav Bail Denied: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అనేక కోణాలు తిరుగుతుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్‌ యాదవ్‌కు తెలంగాణ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. సునీల్‌ బెయిల్‌ తిరస్కరిస్తూ.. పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. బెయిల్‌ పిటిషన్‌పై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ మేరకు తీర్పును వెలువరించింది.

హత్యకేసుతో నేరుగా సంబంధం ఉండటంతోపాటు, రెండో నిందితుడిగా ఉన్నందున బెయిల్‌ మంజూరు చేయవద్దని సీబీఐ తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే, ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు పూర్తి అయిందని, ఇతర షరతులు ఏం ఉన్నా వాటిని కూడా అంగీకరిస్తామని చెబుతూ.. బెయిల్‌ ఇవ్వాలంటూ సునీల్‌ యాదవ్‌ తరఫు న్యాయవాది కోరారు. ఇరువర్గాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తాజాగా సునీల్‌ యాదవ్​కు బెయిల్‌ నిరాకరిస్తూ తీర్పు వెలువరించింది.

YS Vivekananda Reddy murder case Updates: వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్‌కు మధ్యంతర బెయిల్‌

Interim Bail to Sunil Yadav: కొద్ది రోజుల క్రితం సునీల్ యాదవ్​కు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) మధ్యంతర బెయిల్​మంజూరు చేసింది. సునీల్ యాదవ్ తండ్రి అనారోగ్యంతో మరణించడంతో.. అంతిమ సంస్కారాల కోసం రెండు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ సునీల్ యాదవ్ హైకోర్టును కోరారు. అయితే దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. 9,10,17,18 తేదీల్లో ఇద్దరు ఎస్కార్ట్ సిబ్బందితో పులివెందులకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అదే విధంగా తనతో పాటు వస్తున్న ఎస్కార్ట్ సిబ్బంది ఖర్చులను కూడా సునీల్ యాదవ్ భరించాలని తెలిపింది. మధ్యంతర బెయిల్ గడువు ముగియగానే కోర్టులో లొంగిపోవాలని న్యాయస్థానం పేర్కొంది.

వివేకా హత్య కేసులో (Viveka Murder Case) రిమాండ్ ఖైదీగా ఉన్న సునీల్ యాదవ్.. పూర్తి బెయిల్ కోసం పిటిషన్ వేశారు. కేసులో దర్యాప్తు పూర్తయిన కారణంగా బెయిల్​ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 8వ తేదీన వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఇవాళ సునీల్ యాదవ్ బెయిల్​ పిటిషన్​పై తీర్పును వెలువరించింది. ఇరువర్గాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తాజాగా సునీల్‌ బెయిల్​ను కొట్టివేసింది.

Hearing on Bhaskar Reddy Interim Bail Petition: సీబీఐ కోర్టులో వైఎస్‌ భాస్కర్‌రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్..నేడు విచారణ

Sunil Yadav Bail Petition: అయితే సునీల్ యాదవ్ బెయిల్​ పిటిషన్ వేయడం.. కోర్టు కొట్టివేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు బెయిల్ పిటిషన్ వేయగా.. న్యాయస్థానంలో చుక్కెదురైంది. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ కీలకమని.. హత్యకు మందు, ఆ తర్వాత రాజకీయ నేతలతో కలిసి ఉన్నట్లు సీబీఐ తెలిపింది.

Sunitha on Viveka Case: అప్పుడే అవినాష్​ రెడ్డిపై అనుమానం మొదలైంది: సునీత

Last Updated : Sep 15, 2023, 1:00 PM IST

ABOUT THE AUTHOR

...view details