MP Avinash: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా - Avinash Anticipatory Bail enquiry postponed
17:29 April 27
రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు కొనసాగనున్న వాదనలు
MP Avinash Anticipatory Bail Petition: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాయిదాల పర్వం కొనసాగుతోంది. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ.. రేపటికి వాయిదా పడింది. ఇవాళ వాదనలు గంటన్నర కొనసాగగా.. రేపు మధ్యాహ్నం మూడున్నరకు మళ్లీ వాదనలు జరగనున్నాయి. తొలుత అవినాష్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి వాదనలు ప్రారంభించారు. అవినాష్‌ను సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందని.. ఎంపీని లక్ష్యంగా చేసుకుని సీబీఐ దర్యాప్తు చేస్తోందని.. అవినాష్ తరపు న్యాయవాది వాదించారు.
దస్తగిరి వాంగ్మూలం, గూగుల్ టేకౌట్‌పై సీబీఐ ఆధారపడుతోందని.. హత్య చేసిన దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడం సీబీఐకి తగదని... కోర్టు దృష్టికి తెచ్చారు. జమ్మలమడుగు వెళ్తుండగా వివేకా అల్లుడి సోదరుడు ఫోన్ చేశారని.. గుండెపోటు అని చెప్పడంలో కుట్ర లేదని.... కడప ఎంపీ తరపు లాయర్ న్యాయమూర్తికి నివేదించారు. అక్కడున్నవారు చెబితే అదే విషయం చెప్పారన్నారు. గూగుల్ టేకౌట్.. ఫోన్ ఎక్కడుందో చెబుతుంది కానీ వ్యక్తి లొకేషన్ చెప్పదన్న అవినాష్ న్యాయవాది.. లొకేషన్ 20 మీటర్ల తేడా ఉంటుందని గూగుల్ చెబుతోందని అన్నారు. లోపలుంటే లొకేషన్‌లో కచ్చితత్వం ఉండదని గూగుల్ చెబుతోందని.. గూగుల్ టేకౌట్ డేటాను ఏ కోర్టూ సాక్ష్యంగా తీసుకోలేదని వాదించారు. హత్యకు ముందు సునీల్ ఇంట్లో ఉన్నట్టు గూగుల్ టేకౌట్ చెబుతోందన్న అవినాష్ న్యాయవాది.. రాత్రి తొమ్మిదిన్నర నుంచి హత్య వరకు సునీల్ తనతో ఉన్నట్లు దస్తగిరి చెప్పాడని.. కోర్టుకు నివేదించారు. అలాంటప్పుడు దస్తగిరి వాంగ్మూలం తప్పా? గూగుల్ డేటా తప్పా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో ప్రోత్సహించిన బాబాయ్‌ను అవినాష్ ఎందుకు చంపుతారని వాదించారు.
సునీత తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. రక్తపు మడుగులో కనిపిస్తుంటే గుండెపోటు అనడం ఆశ్చర్యకరంగా ఉందని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. వివేకా, అవినాష్ ఇళ్ల మధ్య 500 మీటర్ల దూరం ఉందన్నారు. ఇదే సమయంలో తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగులో లేవంటూ RTI వివరాలను అవినాష్ రెడ్డి.. తెలంగాణ హైకోర్టుకు సమర్పించారు. ఐతే 2019లో హత్యాయత్నం కేసు పెండింగ్‌లో ఉందన్న సునీత.. అందుకు సంబంధించి అవినాష్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించారు. RTI వివరాలు కూడా నమ్మరా అని అవినాష్ న్యాయవాది ప్రశ్నించగా.. ప్రభుత్వం మీదే కదా అని సునీత తరఫు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా సమాధానం ఇచ్చారు. పాత విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నారని అవినాష్ న్యాయవాది అడగ్గా.. హత్య జరిగినప్పటి వివరాలు చెబుతున్నామని సునీత న్యాయవాది బదులిచ్చారు.
ఇవీ చదవండి:
TAGGED:
avinash