తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Telangana Govt letter to KRMB : కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ - తెలంగాణ లేఖ

KRMB
KRMB

By

Published : Jun 1, 2023, 7:37 PM IST

Updated : Jun 1, 2023, 8:01 PM IST

19:33 June 01

Krishna River Management Board : ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను జల్‌శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని లేఖ

Telangana State Letter To Krishna River Management Board : కృష్ణా జలాల్లో రెండు రాష్ట్రాలకు వాటా తేల్చే అంశాన్ని వీలైనంత త్వరగా కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వం నదీ యాజమాన్య బోర్డును కోరింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుఛైర్మన్​కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ లేఖ రాశారు. మే పదో తేదీన బోర్డు 17వ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నీటి వాటా అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాలని లేఖలో పేర్కొన్నారు.

Telangana Letter To KRMB : కేఆర్ఎంబీ మినట్స్ లోనూ ఈ అంశాన్ని పొందుపర్చారని.. కేంద్రానికి పంపినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని అందులో తెలిపారు. కృష్ణా నదిపై రెండు రాష్ట్రాలకు చాలా ప్రాజెక్టులు ఉన్నాయని, నీటి వాటా నిష్పత్తి తేలకుండా వాటికి జలాలను తరలించడం సాధ్యం కాదని అన్నారు. కొత్త నీటి సంవత్సరం కూడా ప్రారంభమైందని, వీలైనంత త్వరగా ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాలని కోరారు. నిర్ణయం వచ్చే వరకు చెరి సగం నిష్పత్తిగా భావించి ఆ ప్రాతిపదికనే తాము ఇండెంట్ ఇస్తామని తెలిపారు. దీంతో పాటు బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు, 2022-23లో అధిక నీటి వినియోగం అంశాన్ని కూడా కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. ఎన్నిసార్లు లేఖలు రాసిన బోర్డు నుంచి ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు.

ఏపీ అధికంగా నీటిని వాడుకుంటుంది : రెండు నెలల క్రితమే ఉమ్మడి జలాశయాల నీటి వాటా కోసం నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధరన్​ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాశారు. అయినా అందుకు తగిన రీప్లే బోర్డు ఇవ్వలేదు. మళ్లీ ఇప్పుడు అదే రీతిలో బోర్డుకు నీటిని పంచే విషయాన్ని త్వరగా తేల్చాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న జలాశయాల్లోని నీటిని ఏపీ ప్రభుత్వమే వాటాకు మించి ఆదనంగా వాడుకుంటోందని.. ఆ నీటిని వాడుకోకుండా చూడాలని లేఖలో రాశారు. ఈ ఫిబ్రవరి నెల ఆఖరుకు ఏపీ 673 టీఎంసీల కృష్ణా నీటిని వాడుకుంటే.. అందుకు భిన్నంగా తెలంగాణ కేవలం211 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకుందని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలకు 971 టీఎంసీల్లో ఏపీ తన వాటా కన్నా 74 శాతానికి పైగా అదనంగా వాడుకుందని తెలిపారు.

ఇవీ చదవండి :

Last Updated : Jun 1, 2023, 8:01 PM IST

ABOUT THE AUTHOR

...view details