తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Governor on TS Formation Day : 'తెలంగాణను దేశంలో నెం.1గా తీర్చిదిద్దుకుందాం' - తెలంగాణ దశాబ్ది వేడుకలు

Telangana Decade Celebrations at Rajbhavan : తెలంగాణ.. అనేక రంగాల్లో ప్రత్యేకత చాటుకుంటోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రాష్ట్రానికి జాతీయస్థాయిలో ఖ్యాతి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నానన్న గవర్నర్... తెలంగాణను దేశంలో నెం.1గా తీర్చిదిద్దుకుందామని తెలిపారు. రాజ్​భవన్​లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలలో పాల్గొని ప్రసంగించారు.

Governor
Governor

By

Published : Jun 2, 2023, 11:18 AM IST

Updated : Jun 2, 2023, 2:22 PM IST

తెలంగాణను దేశంలో నెం.1గా తీర్చిదిద్దుకుందాం: తమిళిసై

Telangana Formation Day Celebrations at Rajbhavan :తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామ స్థాయి నుంచి రాజధాని వరకు నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్​లోని రాజ్​భవన్​లోనూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ​అట్టహాసంగా నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధి సందర్భంగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొని జెండా ఆవిష్కరిచారు.

Tamilisai on TS Formation Day :రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంతో పాటు ఇవాళ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుట్టినరోజు కావడంతో రాజ్​భవన్​లో పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రాజ్​భవన్​లోని దర్బార్ హాలులో కేక్ కోసి గవర్నర్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ఆవిర్భావ వేడుకలు ప్రారంభించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో నిండిన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. 1969 ఉద్యమంలో పాల్గొన్న పలువురు ఉద్యమకారులు ఈ కార్యక్రమానికి హాజరవ్వగా... వారిని సత్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.

జై తెలంగాణ అంటే కేవలం ఒక నినాదం మాత్రమే కాదని... అది ఆత్మగౌరవానికి చిహ్నం అని గవర్నర్ తమిళిసై అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మమేకమైన ప్రతి ఒక్కరికీ గవర్నర్ వందనాలు తెలిపారు. తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్ అభివృద్ధి కాదని... మారుమూల గ్రామాలు కూడా అభివృద్ధి చెందడమే అసలైన పురోగతి అని గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మనమందరం తెలంగాణ అభివృద్ధికి అడుగులు వేయాలన్నారు. తెలంగాణ ప్రజల కోసం తాను కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.

'తెలంగాణ అనేక రంగాల్లో ప్రత్యేకత చాటుకుంటోంది. రాష్ట్రాభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐలు చేయూత ఇవ్వాలని కోరుతున్నా. రాష్ట్రానికి జాతీయస్థాయిలో ఖ్యాతి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. సకలజనుల అభివృద్ధికి పునరంకితమవుదాం. సరికొత్త తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిష్కరించుకుందాం. తెలంగాణను దేశంలో నెం.1గా తీర్చిదిద్దుకుందాం.' - తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ గవర్నర్

హైదరాబాద్‌ సహజసిద్ధ అనుకూలతతో వేగంగా అభివృద్ధి చెందుతోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రాష్ట్రం అంటే హైదరాబాద్ మాత్రమే కాదన్న తమిళిసై... మారుమూల పల్లెలకు కూడా అభివృద్ధి ఫలాలు అందాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొందరు మాత్రమే కాదు.. అందరూ అభివృద్ధి చెందాలన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షతోనే ఉద్యమం వచ్చిందని గవర్నర్ వ్యాఖ్యానించారు.

'తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమం పూర్తి అహింస ఉద్యమం. తెలంగాణ అమరవీరులకు పేరుపేరునా జోహార్లు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. దేవుడు నన్ను తెలంగాణలకు పంపడం నా అదృష్టం. నా జీవితంలో ప్రతి నిమిషం ప్రజల కోసమే. తెలంగాణ ప్రజల కోసం నేను కట్టుబడి ఉంటాను.' - గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

ఇవీ చదవండి :

Last Updated : Jun 2, 2023, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details