Telangana Election War Between Old Rivals : రాష్ట్రంలో శాసనసభ సమరం ముంగిట కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఆయా స్థానాల్లో పట్టు సాధించాలనే లక్ష్యంతో ప్రత్యర్థులుగా మరోసారి బరిలో దిగుతున్నారు. పలు నియోజకవర్గాల్లో(Constituencies) నాలుగోసారి, మూడోసారి పోటీపడుతున్న నేతలతో తాజా ఎన్నికలు ఆసక్తికర పోరుకు వేదిక కాబోతున్నాయి. ఇప్పటికే నాలుగైదు సార్లు తలపడిన అభ్యర్థులే మళ్లీ పోటీ పడుతుండటం.. రాజకీయ క్రీడను రసవత్తరంగా మార్చబోతున్నాయి. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు చిరకాల ప్రత్యర్థులే అయినా.. పలువురు నాయకుల పార్టీలు వేరు కావడం గమనార్హం.
రాజకీయ క్రీడలో చిరకాల ప్రత్యర్థులు-గెలుపు ఎవరిదో..? అందోలు నియోజకవర్గంలో దామోదర రాజనర్సింహా, బాబూమోహన్ ఆరోసారి తలపడుతూ రాష్ట్రంలోనే చిరకాల ప్రత్యర్థులుగా గుర్తింపు పొందారు. 1999 నుంచి రాజనర్సింహా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా.. బాబూమోహన్ తెలుగుదేశం(TDP), టీఆర్ఎస్, బీజేపీ తరఫున బరిలో నిలిచారు. 1999లో టీడీపీ తరఫున బాబూమోహన్ విజయం సాధించగా.. 2004, 2009 ఎన్నికల్లో రాజనర్సింహా గెలుపొందారు.
2014లో టీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన బాబూమోహన్‌ను విజయం వరించింది. 2018లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతికిరణ్ గెలుపొందగా.. రాజనర్సింహా, బాబూమోహన్ ఓటమి చవిచూశారు. తాజాగా.. అందోల్ నుంచి ప్రత్యర్థులుగా రాజనర్సింహా,బాబూమోహన్ బరిలో దిగుతున్నారు.
Election Clash Between Old Rivals :నిర్మల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థిగా అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున శ్రీహరిరావు బరిలో నిలిచారు. 2009 నుంచి ఈ ముగ్గురూ పార్టీలు మారుతూ పోటీచేస్తూనే ఉన్నారు. మంత్రపురిగా పిలిచే మంథనిలో ప్రస్తుత శాసనసభ్యుడు(Member of Legislative Assembly) దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధుకర్ మధ్య నాలుగోసారి పోరు జరగబోతోంది. 2009లో శ్రీధర్‌బాబు.. మధుకర్‌పై విజయం సాధించారు. 2014లో మధు టీఆర్ఎస్ తరఫున గెలిచారు. 2018లో శ్రీధర్‌బాబు గెలుపొందారు.
మధిర స్థానంలో భట్టి విక్రమార్క(CLP Bhatti Vikramarka) ఖమ్మం జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్‌రాజ్ నాలుగోసారి పోటీ పడుతున్నారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా భట్టి విజయం సాధించారు. కమల్‌రాజ్ వరుసగా పోటీ చేసి ఓటమి చెందారు. బోధన్‌లో మహమ్మద్ షకీల్, సుదర్శన్‌రెడ్డి నాలుగోసారి ప్రత్యర్థులుగా అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఇక్కడ 2009లో సుదర్శన్‌రెడ్డి గెలుపొందగా.. 2014, 2018లో షకీల్ జయభేరీ మోగించారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి, చింతా ప్రభాకర్ నాలుగోసారి తలపడబోతున్నారు.