- ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటివి ప్రదర్శించవద్దు: సీఈవో
- టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్‌వర్క్‌ల్లో ప్రచారం నిషిద్ధం: సీఈవో
- పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్‌పోల్స్ నిషేధం: సీఈవో
- సోషల్ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధం: సీఈవో
- అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్ మీడియాలో అవకాశం: సీఈవో
- ఓటరు స్లిప్పులపై పార్టీల గుర్తులు ఉండకూడదు: సీఈవో
- ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారు: సీఈవో
- ఎన్నికల విధుల్లో ఉన్న 1.48 లక్షల మంది ఓటు వేశారు: సీఈవో
- రాష్ట్రవ్యాప్తంగా 27,094 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్: సీఈవో
LIVE UPDATES : ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటివి ప్రదర్శించవద్దు: సీఈవో
Published : Nov 28, 2023, 12:52 PM IST
|Updated : Nov 28, 2023, 5:17 PM IST
17:16 November 28
16:55 November 28
- రాష్ట్రవ్యాప్తంగా ముగిసిన ఎన్నికల ప్రచారం
- ప్రచారం ముగియడంతో మూగబోయిన మైకులు
- ఎల్లుండి పోలింగ్, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు
- ఇతర ప్రాంతాల నేతలు వెళ్లిపోవాలని ఈసీ సూచన
- ఈనెల 30 సాయంత్రం వరకు మద్యం దుకాణాలు బంద్
- ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో అమల్లోకి 144 సెక్షన్
16:47 November 28
- ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో ఆంక్షలు: సీపీ సందీప్ శాండిల్య
- సాయంత్రం 4 నుంచి డిసెంబర్ 1న ఉ.6 వరకు ఆంక్షలు: సీపీ
- ఐదుగురి కంటే ఎక్కువ గుమిగూడటం నిషేధం: సీపీ సందీప్ శాండిల్య
- జంట నగరాల్లో ఎన్నికల ప్రచారం చేస్తే కఠిన చర్యలు: సీపీ సందీప్ శాండిల్య
16:41 November 28
- కామారెడ్డిలో కాంగ్రెస్ నేత శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలో తనిఖీలు
- శ్రీనివాస్‌రెడ్డి కార్యాలయంలో రూ.60 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
16:35 November 28
- తెలంగాణ ప్రజాస్వామ్యానికి సంబంధించిన పండగ 30వ తేదీన జరగబోతుంది
- అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గెలవాలి.. ప్రజాస్వామ్యం గెలవాలి
- కుటుంబ, అవినీతి పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పనున్నారు
- బీఆర్ఎస్ చేతిలో మరోసారి పడి మోసపోవద్దు
- నక్కలాగా కూర్చుని వేచి చూస్తున్న కాంగ్రెస్ మాయలో పడొద్దు
- బీజేపీను ఆశీర్వదించాల్సిందిగా తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం
- కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు బహిష్కరించి తగిన బుద్ది చెప్పాలి
- బీజేపీపైన పెద్ద ఎత్తున విష ప్రచారం చేసిన ప్రజలు గుర్తించారు
- బీజేపీకు రోజు రోజుకు ఆదరణ పెరిగింది.. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది
- ఎవరికి బీ- టీమ్‌గా ప్రజలు గుర్తించలేదు.. ఏ టీమ్ గానే ప్రజలు ఎన్నికల ప్రచారంలో ఆదరించారు
- మోదీ రోడ్ షోకు ప్రజలు ఘన స్వాగతం పలికారు.. నిజమైన ప్రజాస్వామ్యం కనిపించింది
16:34 November 28
- రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి రాజకీయ అవగాహన, మజ్లీస్ పార్టీ గురించి లేదు
- మజ్లీస్ పార్టీ బీజేపీ కనుసైగల్లో పని చేస్తుందని రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు
- మజ్లిస్ పార్టీని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ
- మజ్లీస్ కార్యాలయమైన దారుసలాంను కాంగ్రెస్ పార్టీ మజ్లీస్ కు కట్టబెట్టింది
- ప్రధాని హోదాలో ఇందిరా గాంధీ దారుసలాంను సందర్శించారు
- హైదరాబాద్‌లో మజ్లీస్ పార్టీ గుండాయిజం, అరాచకాలకు కారణం కాంగ్రెస్ పార్టీ
- ఎట్టి పరిస్థితుల్లో మజ్లీస్ పార్టీ గుండాయిజాన్ని సమర్థించేది లేదు
- ప్రాజెక్టుల పేరుతో పెద్ద ఎత్తున ప్రజా ధనాన్ని దోపిడీ చేసిన భారాస సర్కారుకు బుద్ది చెప్పాలి
- కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిస్తే ఆర్థిక విధ్వంసం ఏర్పడుతుంది: కిషన్ రెడ్డి
16:12 November 28
- రాష్ట్రంలో 13 నియోజకవర్గాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం
- సమస్యాత్మక ప్రాంతాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం
- సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాలలో ముగిసిన ప్రచారం
- ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లిలో ముగిసిన ప్రచారం
- ములుగు, పినపాక, ఇల్లందులో ముగిసిన ప్రచారం
- రాష్ట్రంలో తుది అంకానికి చేరుకున్న ప్రచార పర్వం
- కాసేపట్లో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి తెర
- రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్న పార్టీల అగ్ర నేతలు
15:23 November 28
పోలింగ్ రోజు విధిగా సెలవు ప్రకటించాలన్న సీఈవో వికాస్ రాజ్
- ప్రైవేట్ సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలన్న సీఈవో
- ఉద్యోగులు ఓటు వినియోగించుకునేలా సెలవు ఇవ్వాలని ఆదేశాలు
- గత ఎన్నికల వేళ కొన్ని సంస్థలు సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయన్న సీఈవో
- 2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల వేళ సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు: సీఈవో
- అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు ఆదేశం
- సెలవు ఇవ్వని సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీఈవో ఆదేశం
13:40 November 28
తెలంగాణ ఉద్యమ సమయంలో అతిపెద్ద బహిరంగ సభ వరంగల్‌లో నిర్వహించాం
- ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణతి ఇంకా రాలేదు
- ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పుడు జరుగున్నది 95వ సభ
- తెలంగాణ ఉద్యమలో కీలక ఘట్టాలకు వరంగల్ వేదికగా నిలిచింది
- తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసమే భారాస పుట్టింది
- ఇందిరమ్మ రాజ్యం సరిగా ఉంటే ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టారు
- 10 ఏళ్ల భారాస పాలన, గత 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకోవాలి
- దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది
- కంటి వెలుగు కార్యక్రమం ఉంటుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదు
- రాష్ట్రంలో 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి 80 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశాం
- ఎన్నికల తర్వాత పింఛన్‌ను రూ.5 వేలకు పెంచుతాం
13:22 November 28
హైదరాబాద్ జిల్లాలోని విద్యాసంస్థలకు రేపు, ఎల్లుండి సెలవులు
- ఎన్నికల సందర్భంగా రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవులు: కలెక్టర్
13:10 November 28
కేసీఆర్ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుంది: కేటీఆర్
- కామారెడ్డిని అభివృద్ధి చేసే బాధ్యతను నేను తీసుకుంటా: కేటీఆర్
- తెలంగాణను తెచ్చిన కేసీఆర్‌కు లోకల్, నాన్ లోకల్ అని ఉంటుందా?
- తెలంగాణ మినహా.. ఏ రాష్ట్రంలోనూ బీడీ కార్మికులకు పింఛన్లు లేవు
- భారాస మళ్లీ గెలిస్తే.. బీడీ కార్మికుల పింఛనుకు కటాఫ్ డేట్ తొలగిస్తాం
- 4.5 లక్షల మంది బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నాం: కేటీఆర్
- తొమ్మిదిన్నరేళ్లలో దేశానికి, రాష్ట్రానికి మోదీ చేసింది శూన్యం: కేటీఆర్
- భారాస మళ్లీ గెలిస్తే... పింఛన్లను దశలవారీగా రూ.5 వేలకు పెంచుతాం
- భారాస మళ్లీ గెలిస్తే... జనవరిలోనే కొత్త రేషన్‌కార్డులు ఇస్తాం
- భారాస మళ్లీ గెలిస్తే రేషన్‌కార్డుపై సన్నబియ్యం ఇస్తాం: కేటీఆర్
- రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పిస్తాం
- అసైన్డ్ భూములపై యజమానులకు పూర్తి పట్టా హక్కులు ఇస్తాం
10:44 November 27
LIVE UPDATES :
ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందటం బీజేపీ విధానం: రాహుల్‌గాంధీ
- బీజేపీ వ్యాప్తి చేసిన విద్వేషాన్ని భారత్ జోడో యాత్ర సమయంలో చూశాను: రాహుల్‌గాంధీ
- బీజేపీని ప్రశ్నించినందుకు నాపై 24 కేసులు పెట్టారు: రాహుల్‌గాంధీ
- దిల్లీలో ఎంపీల నివాసం నుంచి నన్ను వెళ్లగొట్టారు: రాహుల్‌గాంధీ
- ఎంపీ నివాసం నుంచి నన్ను వెళ్లగొట్టినా.. నేను బాధపడలేదు: రాహుల్‌గాంధీ
- దేశ ప్రజలందరి గుండెల్లో నాకు ఇల్లు ఉందని బయటికి వచ్చాను: రాహుల్‌గాంధీ
- ఈడీ విచారణ అని చెప్పిన నన్ను గంటలకొద్దీ కూర్చోబెట్టారు: రాహుల్‌గాంధీ
- ఎంఐఎం అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలో బీజేపీ నిర్ణయిస్తుంది: రాహుల్‌గాంధీ
- కాంగ్రెస్‌ను దెబ్బ తీయాలనే ఉద్దేశంతోనే ఎంఐఎం పోటీ చేస్తుంది: రాహుల్‌గాంధీ
- బీజేపీ చెప్పిన చోటనే ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేస్తారు: రాహుల్‌గాంధీ
- బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం ఒకటే టీమ్, కలిసి పని చేస్తారు: రాహుల్‌గాంధీ
- అవినీతిపరుడైన కేసీఆర్‌పై ఒక్క కేసు కూడా లేదు: రాహుల్‌గాంధీ
- మోదీ సర్కార్ తెచ్చిన అన్ని బిల్లులకు భారాస మద్దతు ఇచ్చింది: రాహుల్‌గాంధీ
- భారాసకు ఓటు వేస్తే.. మళ్లీ దొరల సర్కార్ వస్తుంది: రాహుల్‌గాంధీ
- కాంగ్రెస్‌కు ఓటు వేస్తే... ప్రజల సర్కార్ వస్తుంది: రాహుల్‌గాంధీ
- కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు అవినీతి జరిగింది: రాహుల్
- కాళేశ్వరంలో జరిగిన అవినీతి వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగింది: రాహుల్‌గాంధీ
- హైదరాబాద్‌కు మెట్రో రైలు ప్రాజెక్టు కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం
- హైదరాబాద్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే
- ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు మంజూరు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ
- భాజపా, భారాస పాలనలో ధరలు విపరీతంగా పెరిగాయి: రాహుల్
- రూ.1200కు పెరిగిన గ్యాస్ సిలిండర్‌ను రూ.400కే ఇస్తాం
- రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేలు చొప్పున రైతుభరోసా ఇస్తాం
- యువ వికాసం విద్యార్థులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తాం
- మహిళల ఖాతాల్లో ప్రతినెలా రూ.2500 వేస్తాం: రాహుల్‌గాంధీ
- పేదల నుంచి కేసీఆర్ దోచుకున్న ప్రతి రూపాయి వసూలు చేసి మళ్లీ పేదల జేబులో వేస్తాం
- రాష్ట్రంలో 2 శాతం ఓట్లు వచ్చే భాజపా.. బీసీ వ్యక్తిని సీఎం ఎలా చేస్తుంది
- భాజపా బండి 4 టైర్లలో గాలి పోయి మూలకు పడింది