Telangana Congress CM Swearing Ceremony : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 64 సీట్లు సాధించి సాధారణ మెజార్టీతో రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డీజీపీ అంజనీకుమార్‌ను ఆదేశించారు. ఈరోజు సాయంత్రం నుంచి ముహూర్తానికి సంబంధించిన సమయం ప్రారంభమవుతుందని రేవంత్ డీజీపీతో తెలిపారు. సాధారణ ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అంజనీ కుమార్‌కు సూచించారు. త్వరలో గవర్నర్‌ను కలవనున్నట్లు చెప్పారు.
Telangana Assembly Election Results 2023 : ఈ మేరకు డీజీపీ, అదనపు డీజీలు ఎస్కే జైన్, మహేశ్ భగవత్‌లను జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి పిలిపించుకుని సమాచారం అందించారు. రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రమాణ స్వీకారానికి సంబంధించి భద్రత ఏర్పాట్లపై డీజీపీ సమీక్షించారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన వారికి 2+2 భద్రత కల్పించాలని ఆదేశించారు. ముప్పు ఉన్న వాళ్ల జాబితా సిద్ధం చేయాలని అంతర్గత భద్రతా విభాగం ఐజీకి సూచించారు. అవసరమైన వాళ్లకు అదనపు భద్రత కేటాయించాలన్నారు.
Telangana Election Result 2023 LIVE: కాంగ్రెస్‌కు కలిసొచ్చిన వారసత్వ రాజకీయం - విజయతీరాలకు ఆ కుటుంబాలు
ఇదిలా ఉండగా రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్నిఏర్పాటు చేసేందుకు సమాయత్తం అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలను హైదరాబాద్ రావాల్సిందిగా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. రాత్రికి గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో ఎమ్మెల్యేలతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మానిక్‌రావ్ ఠాక్రేతో పాటు ఏఐసీసీ పరిశీలకులు డీకే శివకుమార్, మురళీధర్ సహా పలువురు నేతలు సమావేశమవుతారు.
అధిష్ఠానం ఆమోదం లభించగానే గవర్నర్ అపాయింట్మెంట్ : ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ పరిశీలకులు తీసుకుంటారు. ఆ అభిప్రాయాన్ని అధిష్ఠానానికి నివేదించనున్నారు. అధిష్ఠానం ఆమోదం లభించగానే గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుని ఎమ్మెల్యేల అభిప్రాయాలను అందజేసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. గవర్నర్‌ను ఇవాళ రాత్రికి కానీ, రేపు ఉదయం కానీ కలిసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Rangareddy District Telangana Assembly Elections Result 2023 Live : మెజారిటీకి అడ్డాగా మారిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా