తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తెలంగాణ కేబినెట్ కొత్త జట్టు - రేవంత్​తో పాటు ప్రమాణస్వీకారం చేయనున్న మంత్రులు వీరే

Telangana Cabinet Ministers List 2023 : రాష్ట్రంలో నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంతో పలువురు కాంగ్రెస్ నేతలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్ర కేబినెట్‌లో ముఖ్యమంత్రి కాకుండా 17 మంది మంత్రులకు అవకాశం ఉంది. అయితే సీఎంతో పాటు 12 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Telangana Cabinet Ministers List 2023
Telangana Cabinet Ministers

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 10:35 AM IST

Updated : Dec 7, 2023, 11:13 AM IST

Telangana Cabinet Ministers List 2023 : హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం రేవంత్‌ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే సమయంలో మంత్రివర్గ కూర్పు జరగనుంది. సీఎం రేవంత్​ రెడ్డితో పాటు, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్​రెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ, సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంత్రుల జాబితాలో ఉన్నవారికి రేవంత్​ రెడ్డి స్వయంగా ఫోన్లు చేసి చేబుతున్నారు.

Congress Government in Telangana 2023 :మంత్రివర్గ కూర్పులోనూ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాలకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున మొదటి విడతలో ఆ జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావుకి అవకాశం దక్కింది. ఈ జిల్లా నుంచి రెండోసారి గెలిచిన దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యే పేరు కూడా వినిపిస్తోంది.

Telangana Congress New Ministers 2023 :ఖమ్మం జిల్లా నుంచి మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి నల్గొండ నుంచి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉమ్మడి వరంగల్‌ నుంచి సీతక్క, కొండా సురేఖ, ఉమ్మడి మెదక్‌ నుంచి దామోదర రాజనర్సింహ, నిజామాబాద్‌ నుంచి సుదర్శన్‌రెడ్డి, ఉమ్మడి కరీంనగర్‌ నుంచి శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ చేత మంత్రులుగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

Congress New Cabinet List 2023 :ఇప్పటికేఎవరెవరికి ఏ శాఖ అనే విషయంలో కూడా కొంత స్పష్టత వచ్చినట్లు చెబుతున్నారు. శ్రీధర్‌బాబుకు ఆర్థిక శాఖ కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. స్పీకర్‌ పదవి ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినా శ్రీధర్‌బాబు తిరస్కరించినట్లు తెలిసింది. భట్టి విక్రమార్కకు రెవెన్యూ శాఖ కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతున్నా స్పష్టత రావాల్సి ఉంది. ఈయనను ఉప ముఖ్యమంత్రిగా నియమించి రెవెన్యూ లేదా మరో శాఖ కేటాయించే అవకాశముంది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి నీటిపారుదల శాఖ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

Last Updated : Dec 7, 2023, 11:13 AM IST

ABOUT THE AUTHOR

...view details