తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భట్టికి రెవెన్యూ, శ్రీధర్ బాబుకు ఆర్థికం, కోమటిరెడ్డికి నీటిపారుదల శాఖ - కొత్త సర్కారులో మంత్రులు వీళ్లే! - కాంగ్రెస్ కొత్త క్యాబినెట్ జాబితా 2023

Telangana Cabinet Ministers List 2023 : రాష్ట్రంలో నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంతో, మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర క్యాబినెట్‌లో ముఖ్యమంత్రి కాకుండా 17 మంది మంత్రులకు అవకాశం ఉండగా, ప్రస్తుతం పాక్షికంగానే ప్రమాణ స్వీకారం చేస్తారా? లేక పూర్తిస్థాయిలోనా అనే విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది. మొదట ఎనిమిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాలని తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించాలనేది రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల ఆలోచన. కానీ అధిష్ఠానం మాత్రం పూర్తిస్థాయి మంత్రివర్గంతోనే వెళ్లమని సూచించినట్లు తెలిసింది.

Telangana New Cabinet Ministers List 2023
Telangana New Cabinet

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 7:04 AM IST

కాంగ్రెస్ సర్కారులో మంత్రులు వీళ్లే - డిప్యూటీగా భట్టి విక్రమార్క మరో శాఖ కూడా!

Telangana Cabinet Ministers List 2023 : హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం రేవంత్‌ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే సమయంలో మంత్రివర్గ కూర్పు జరగనుంది. కానీ ఎంతమందికి అవకాశం ఇస్తారనే విషయంలో మాత్రం స్పష్టత కొరవడింది. మంత్రుల ఎంపిక విషయంపై బుధవారం దిల్లీలో ఏఐసీసీ నాయకులతో సమావేశమైన రేవంత్‌ రెడ్డి, ఈ అంశంపై చర్చలు జరిపినట్లు సమాచారం. ముఖ్యమంత్రితో పాటు 17మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఉండగా, ఎంతమందికి బాధ్యతలు అప్పగిస్తారనే విషయంపై మాత్రం స్పష్టత రాలేదని తెలుస్తోంది.

Congress Government in Telangana 2023 :మంత్రివర్గ కూర్పులోనూ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాలకు పెద్దపీట వేయనున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున మొదటి విడతలో ఆ జిల్లా నుంచి మరొకరికి అవకాశం ఉంటుందా లేదా చూడాల్సి ఉంది. ఒకవేళ అవకాశం ఉంటే జూపల్లి కృష్ణారావుకు ఛాన్స్‌ దక్కవచ్చు. ఈ జిల్లా నుంచి రెండోసారి గెలిచిన దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యే పేరు కూడా వినిపిస్తోంది.

మరికొద్ది గంటల్లో సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం- అందరూ ఆహ్వానితులే

Telangana Congress New Ministers 2023 :ఖమ్మం జిల్లా నుంచి మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి నల్గొండ నుంచి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి లేదా ఆయన సతీమణి పద్మావతి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు, రాజగోపాల్‌రెడ్డి పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్‌ నుంచి సీతక్క, కొండా సురేఖ, ఉమ్మడి మెదక్‌ నుంచి దామోదర రాజనర్సింహా, నిజామాబాద్‌ నుంచి సుదర్శన్‌రెడ్డి, ఉమ్మడి కరీంనగర్‌ నుంచి శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ ఉండనున్నట్లు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి వివేక్‌ లేదా వినోద్‌, ప్రేమసాగర్‌ రావుల పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తంగా 8 మంది సీనియర్లకు మాత్రమే అవకాశం దక్కవచ్చని సమాచారం.

Congress New Cabinet List 2023 :ఎవరెవరికి ఏ శాఖ అనే విషయంలో కూడా ఇప్పటికే కొంత స్పష్టత వచ్చినట్లు చెబుతున్నారు. శ్రీధర్‌బాబుకు ఆర్థికశాఖ కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. స్పీకర్‌ పదవి ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినా శ్రీధర్‌బాబు తిరస్కరించినట్లు తెలిసింది. భట్టి విక్రమార్కకు రెవెన్యూ శాఖ కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతున్నా స్పష్టత రావాల్సి ఉంది. ఈయనను ఉప ముఖ్యమంత్రిగా నియమించి రెవెన్యూ లేదా మరో శాఖ కేటాయించే అవకాశముంది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి నీటిపారుదల శాఖ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉంచి మిగిలినవి భర్తీ చేయవచ్చనే అభిప్రాయాన్ని కూడా పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మొదటిసారిగా ఎన్నికైన వారికి, ఓడిపోయిన వారికి అవకాశం ఇవ్వొద్దని ఏఐసీసీ నాయకులు రేవంత్‌ రెడ్డికి సూచించినట్లు తెలిసింది.

నేడు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెబుతారా - తొలి సంతకం దేనిపై చేస్తారో?

కొలువుదీరనున్న కొత్త కేబినెట్ - ఖమ్మం నుంచి మంత్రి పదవి ఎవరికో?

ABOUT THE AUTHOR

...view details