Telangana BJP MLA Candidates First List 2023 : హుజూరాబాద్, గజ్వేల్ నుంచి ఈటల.. గోషామహల్ నుంచి రాజాసింగ్.. బీజేపీ తొలి జాబితా విడుదల - బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి జాబితా 2023
Telangana BJP MLA Candidates First List 2023 : శాసనసభ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల
Telangana BJP MLA Candidates First List 2023 హుజూరాబాద్, గజ్వేల్ నుంచి ఈటల.. గోషామహల్ నుంచి రాజాసింగ్.. బీజేపీ తొలి జాబితా విడుదల
Telangana BJP MLA Candidates First List 2023 : శాసనసభ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల మొదటి జాబితానుభారతీయ జనతా పార్టీ(BJP) ప్రకటించింది. 52 మందితో బీజేపీ తొలి జాబితా(BJP MLA Candidates First List) విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీన జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖారారు చేసిన పేర్లతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌లకు అక్కణ్నుంచి మరోమారు అవకాశం కల్పించారు. ఈటల రాజేందర్‌కు హుజూరాబాద్‌తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ టికెట్ కూడా ఇచ్చారు. దీంతో ఆయన రెండు స్థానాల నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు.
BJP Releases 55 MLA Candidates For Telangana :గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేసిన కాసేపటికే ఆయనకు టికెట్ ప్రకటించారు. ముగ్గురు ఎంపీలకు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు బోథ్ నుంచి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు. 12 మంది మహిళలకు తొలి జాబితాలో సీటు దక్కింది. మొదటి జాబితాలో 8 మంది ఎస్సీలు, 14 మంది ఎస్టీలు, 19 మంది బీసీలకు అవకాశం కల్పించారు. అలాగే రెడ్డి సామాజికవర్గం వారికి 12, వెలమ వర్గం వారికి ఐదు సీట్లు దక్కాయి.