తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హస్తానికే అధికారం! - తెలంగాణ ఎగ్జిట్ పోల్స్​ 2023 ఫలితాలు ఇవే - చాణక్య ఎగ్జిట్​ పోల్ రిజల్ట్స్​ 2023

Telangana Assembly Elections Exit Poll Results 2023 : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ముగియటంతో ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వెలువడుతున్నాయి. ఓటర్ల నాడిని అంచనా వేసిన పలు సర్వేలు.. కాంగ్రెస్‌ పైచేయి సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి.

AARAA Exit Polls 2023
Telangana Assembly Elections Exit Poll Results 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2023, 7:07 PM IST

Updated : Nov 30, 2023, 9:45 PM IST

తెలంగాణ ఎగ్జిట్​ పోల్స్​ 2023

Telangana Assembly Elections Exit Poll Results 2023 : తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల నాడిని అంచనా వేసిన పలు సర్వేలు కాంగ్రెస్‌ పార్టీకి మెజారిటీ స్థానాలు వస్తాయని వెల్లడిస్తున్నాయి. పోల్‌ ట్రెండ్స్‌ అండ్‌ స్ట్రాటజీ సంస్థ (పీటీఎస్‌ గ్రూపు) వెల్లడించిన ఎగ్జిట్‌ పోల్స్‌.. ఓటర్లు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించింది.

సీఎన్​ఎన్​​ ఐబీఎన్​ ఎగ్జిట్ పోల్స్​ 2023

ఆ సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం.. బీఆర్‌ఎస్‌ 35 నుంచి 40 స్థానాల వరకు గెలుపొందొచ్చని వెల్లడించింది. కాంగ్రెస్‌ పార్టీకి 65 నుంచి 70 సీట్ల వరకు రావొచ్చని అంచనా వేయగా.. బీజేపీ 7 నుంచి 10 స్థానాల్లో గెలుస్తుందని పేర్కొంది. ఎంఐఎం 6 నుంచి ఏడు, ఇతరులు ఒకటి నుంచి రెండు స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.

ఆరా ఎగ్జిట్​ పోల్స్ 2023

AARAA Exit Polls 2023 : ఆరా మస్తాన్‌ ప్రీ పోల్‌ సర్వే ప్రకారం అధికార బీఆర్​ఎస్​ 41 నుంచి 49కి మాత్రమే పరిమితమవుతుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌ 58 నుంచి 67 చోట్ల గెలుస్తుందని వెల్లడించింది. ఇక బీజేపీ 5 నుంచి 7, ఇతరులకు 7 నుంచి 9 సీట్లు రావొచ్చని తెలిపింది. పార్టీల వారీగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్​ఎస్​కు 39.58 శాతం, కాంగ్రెస్​కు 41.13 శాతం, బీజేపీ 10.47, ఇతరులకు 8.82 శాతం లెక్కన ఓట్ల శాతాలు ఉన్నట్లు ఆరా సంస్థ వెల్లడించింది. కామారెడ్డిలో బీజేపీ గెలిచే అవకాశముందని.. సీఎం కేసీఆర్‌ రెండో స్థానంలో ఉండొచ్చని చెబుతోంది.

జన్‌కీబాత్‌ ఎగ్జిట్​ పోల్స్​ సర్వే 2023

Jan ki Baat Exit Polls 2023 : జన్‌కీబాత్‌ సర్వే ప్రకారం.. కాంగ్రెస్‌ 48 నుంచి 64 చోట్ల గెలుస్తుందని అంచనా వేసింది. అధికార బీఆర్​ఎస్​ 40 నుంచి 55 స్థానాల్లో గెలవొచ్చని చెబుతోంది. అలాగే బీజేపీ 7 నుంచి 13 నియోజకవర్గాలు, మజ్లిస్‌ పార్టీ 4 నుంచి 7 చోట్ల గెలుస్తుందని వెల్లడించింది.

చాణక్య స్ట్రాటజీస్​ ఎగ్జిట్​ పోల్స్​ 2023

అలాగే మరో సంస్థ చాణక్య స్ట్రాటజీస్‌.. కాంగ్రెస్‌ స్పష్టమైన ఆధిక్యత సాధించబోతుందని అంచనా వేసింది. 67 నుంచి 78 నియోజకవర్గాల్లో హస్తం పార్టీ గెలవబోతుందని ఆ సంస్థ వెల్లడించింది. అధికార బీఆర్​ఎస్​ 22 నుంచి 31 చోట్ల, బీజేపీ 6 నుంచి 9 నియోజకవర్గాల్లో, ఎంఐఎం 6 నుంచి 7 చోట్ల గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది.

పీపుల్స్​ పల్స్​ ఎగ్జిట్ పోల్స్​ 2023

Peoples Pulse Exit polls 2023 : పీపుల్స్‌ పల్స్‌, సౌత్‌ ఫస్ట్‌ సర్వేలు.. కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడించింది. కాంగ్రెస్‌కు 62 నుంచి 72 స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించాయి. బీఆర్​ఎస్​కు 35 నుంచి 46 సీట్లు రావొచ్చని.. మజ్లిస్‌ పార్టీ 6 నుంచి 7, బీజేపీ 3 నుంచి 8 స్థానాలు, ఇతరులు 1 నుంచి 2 నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉందని వెల్లడించాయి.

రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్​ పోల్స్​ 2023
Last Updated : Nov 30, 2023, 9:45 PM IST

ABOUT THE AUTHOR

...view details