తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తెలంగాణలో అత్యధిక స్థానాలు హస్తానికే - ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలివే - Telangana Election Exit Poll Results 2023

telangana assembly elections
telangana assembly elections 2023 Exit polls

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2023, 5:35 PM IST

Updated : Nov 30, 2023, 7:10 PM IST

18:38 November 30

జన్​కీ బాత్ ఎగ్జిట్​ పోల్స్

18:37 November 30

చాణక్య స్టాటజీస్​ ఎగ్జిట్​ పోల్స్

18:26 November 30

పొలిటికల్​ లాబోరేటరీ ఎగ్జిట్​ పోల్స్

18:18 November 30

రేస్​ ఎగ్జిట్​ పోల్స్​

18:10 November 30

పీపుల్స్​ పల్స్​ ఎగ్జిట్ పోల్స్

18:02 November 30

ఆరా మస్తాన్‌ ప్రీ పోల్‌ సర్వే..

17:09 November 30

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల నాడిని అంచనా వేసిన పలు సర్వేలు కాంగ్రెస్‌ పార్టీకి మెజారిటీ స్థానాలు వస్తాయని వెల్లడిస్తున్నాయి. పోల్‌ ట్రెండ్స్‌ అండ్‌ స్ట్రాటజీ సంస్థ (పీటీఎస్‌ గ్రూపు) వెల్లడించిన ఎగ్జిట్‌ పోల్స్‌.. ఓటర్లు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించింది. ఆ సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం.. బీఆర్‌ఎస్‌ 35 నుంచి 40 స్థానాల వరకు గెలుపొందొచ్చని వెల్లడించింది. కాంగ్రెస్‌ పార్టీకి 65 నుంచి 70 సీట్ల వరకు రావొచ్చని అంచనా వేయగా.. బీజేపీ 7 నుంచి 10 స్థానాల్లో గెలుస్తుందని పేర్కొంది. ఎంఐఎం 6 నుంచి ఏడు, ఇతరులు ఒకటి నుంచి రెండు స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.

ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీల వారీగా పరిశీలించినట్లయితే..

  • ఆదిలాబాద్​ - బీఆర్‌ఎస్‌ 3, కాంగ్రెస్‌ 4 నుంచి 6, బీజేపీ 2 నుంచి 4, ఇతరులకు ఒకటి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా - బీఆర్‌ఎస్‌కు 3 నుంచి 5, కాంగ్రెస్‌ 3 నుంచి 4, బీజేపీకి 1 నుంచి 2,
  • కరీంనగర్‌ జిల్లా - బీఆర్‌ఎస్‌ 2 నుంచి 4, కాంగ్రెస్‌ 9, బీజేపీ 2
  • మెదక్‌ జిల్లా - బీఆర్‌ఎస్‌ 4 నుంచి 6, కాంగ్రెస్‌ 4 నుంచి 6,
  • మహబూబ్‌నగర్‌ జిల్లా - బీఆర్‌ఎస్‌ 2 నుంచి 4, కాంగ్రెస్‌ 9 నుంచి 12
  • రంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్‌ 5 నుంచి 7, కాంగ్రెస్‌ 5 నుంచి 7, బీజేపీ 2
  • హైదరాబాద్‌ - బీఆర్ఎస్​ 5 నుంచి 7, కాంగ్రెస్‌ 2 నుంచి 4, బీజేపీ 1 నుంచి 2, వరంగల్‌ - బీఆర్‌ఎస్‌ 3 నుంచి 5, కాంగ్రెస్‌కు 7 నుంచి 9
  • నల్గొండలో బీఆర్‌ఎస్‌ 3, కాంగ్రెస్‌కు 9 నుంచి 11
  • ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ 2, కాంగ్రెస్‌కు 7 నుంచి 9, ఇతరత్ర 1

ఆరా మస్తాన్‌ ప్రీ పోల్‌ సర్వే ప్రకారం.. బీఆర్‌ఎస్​కు 41-49, కాంగ్రెస్‌కు 58-67, బీజేపీ 5-7, ఇతరులు 7 నుంచి 9 వరకు రావచ్చని పేర్కొన్నారు. పార్టీల వారీగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ 39.58 శాతం, కాంగ్రెస్‌ 41.13 శాతం, బీజేపీ 10.47, ఇతరులకు 8.82 శాతం లెక్కన ఓట్ల శాతాలు ఉన్నట్లు ఆరా సంస్థ వెల్లడించింది.

Last Updated : Nov 30, 2023, 7:10 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details