తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Telangana Assembly Election Results Live 2023 : ఇట్స్​ జడ్జిమెంట్ టైమ్ - మరికొన్ని గంటల్లో తెలంగాణ ప్రజల తీర్పు - తెలంగాణ అసెంబ్లీ రిజల్ట్స్ 2023

Telangana Assembly Election Results Live 2023 : శాసనసభ ఎన్నికల ఫలితాల ఉత్కంఠ ఇవాళ వీడనుంది. రాష్ట్రవ్యాప్తంగా 49 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభించి అరగంట అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు. గరిష్టంగా జూబ్లీహిల్స్‌లో 26 రౌండ్లలో లెక్కింపు జరగనుండగా భద్రాచలంలో కేవలం 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తవుతుంది. 500కు పైగా పోలింగ్ కేంద్రాలన్న ఆరు నియోజకవర్గాల్లో లెక్కింపు కోసం 28 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఉదయం పదిన్నర ప్రాంతంలో మొదటి ఆధిక్యం తెలిసే అవకాశాలున్నాయి.

Telangana Assembly Election Results Live 2023
Telangana Assembly Election Results Live 2023

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 8:42 AM IST

Telangana Assembly Election Results Live 2023: రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు సంబంధించి 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు (Telangana Election Counting 2023)ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మిగిలిన జిల్లాల్లో ఒకటి చొప్పున లెక్కింపు కేంద్రాలు ఉన్నాయి. ఓట్ల లెక్కింపు కోసం 119 నియోజకవర్గాల్లో మొత్తం 1798 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఆరు నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ లెక్కింపు కోసం 28 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశారు.

ఇట్స్​ జడ్జిమెంట్ టైమ్ - మరికొన్ని గంటల్లో తెలంగాణ ప్రజల తీర్పు

గరిష్ఠంగా మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో లెక్కింపు కోసం 28 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశారు. మల్కాజ్‌గిరి, కూకట్‌పల్లి, ఉప్పల్ నియోజకవర్గాల్లో లెక్కింపు కోసం 20 చొప్పున టేబుళ్లు ఉంటాయి. నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్, పటాన్‌చెరు, హుజూర్‌నగర్‌, తుంగతుర్తి నియోజకవర్గాల్లో 18 చొప్పున టేబుళ్లలో లెక్కింపు జరుగుతుంది.

ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రంలోకి ఎప్పుడైనా వెళ్లారా? లోపల ఏం జరుగుతుందో తెలుసా?

Telangana Election Results Telugu 2023 : కరీంనగర్, సంగారెడ్డి, కోదాడ, ఖమ్మం నియోజకవర్గాల్లో 16 చొప్పున, షాద్‌నగర్‌లో 12టేబుళ్లలో లెక్కింపు జరగనుంది. మిగిలిన నియోజకవర్గాల్లో 14 చొప్పున టేబుళ్లలో లెక్కింపు చేపడతారు. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, కౌంటింగ్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. 49 లెక్కింపు ప్రాంతాల్లో నియోజకవర్గానికి ఒకరు చొప్పున 119 మంది ఈసీఐఎల్ ఇంజనీర్లు కూడా అందుబాటులో ఉంటారు. ఈవీఎంలకు సంబంధించి ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిశీలించి పరిష్కరించేలా ఏర్పాటు చేశారు.

భాగ్యనగరంలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తి - 15 కేంద్రాల్లో కౌంటింగ్‌

అన్ని నియోజకవర్గాల ఫలితాలు (Counting centers in Telangana) మొత్తం 2417 రౌండ్లలో తేలనున్నాయి. అత్యధికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 26 రౌండ్లలో లెక్కింపు చేపట్టనుండగా, అత్యల్పంగా భద్రాచలంలో కేవలం 13 రౌండ్లలో లెక్కింపు జరుగుతుంది. అశ్వరావుపేటలో 14 రౌండ్లు, చార్మినార్‌లో 15 రౌండ్లు ఉన్నాయి. ఆర్మూర్, సికింద్రాబాద్‌లో 16 రౌండ్ల చొప్పున లెక్కింపు చేపడతారు. ఏడు నియోజకవర్గాల్లో 17 రౌండ్లలో 12 నియోజకవర్గాల్లో 18 రౌండ్లలో లెక్కింపు ఉంటుంది. 19 రౌండ్లలో 16 నియోజకవర్గాలు, 20 రౌండ్లులో 17 నియోజకవర్గాలు ఉన్నాయి. 27 నియోజకవర్గాల్లో 21 రౌండ్లలో, 19 నియోజకవర్గాల్లో 22 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. 23 రౌండ్లలో పది నియోజకవర్గాల లెక్కింపు జరుగుతుంది.

Telangana Assembly Elections 2023 :చొప్పదండి, కార్వాన్ లెక్కింపు 24 రౌండ్లలో, కరీంనగర్, ఇబ్రహీంపట్నం, యూకుత్‌పురా నియోజకవర్గాల్లో 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రతి రౌండ్ లెక్కింపు తర్వాత ఏజెంట్ల సంతకాలు తీసుకున్న అనంతరం కౌంటింగ్ అబ్జర్వర్ ఫలితాన్ని పరిశీలిస్తారు. ఆ రౌండ్‌లో ఉన్న రెండు ఈవీఎంలలోని ఫలితాలను ర్యాండమ్‌గా అబ్జర్వర్ పరిశీలిస్తారు. ఆ తర్వాత సంబంధిత రౌండ్‌కు సంబంధించిన ఫలితాలను వెల్లడిస్తారు. మొత్తం లెక్కింపు పూర్తయ్యాక ఐదు వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను ర్యాండమ్‌గా లెక్కిస్తారు. ఆ తర్వాతే ఫలితాన్ని ప్రకటిస్తారు.

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు భారీ ఏర్పాట్లు - 12 నియోజకవర్గాల్లో పోలీసుల గట్టి బందోబస్తు

లెక్కింపు కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఐపాడ్స్, ల్యాప్ టాప్‌లు తదితర ఎలక్ట్రానిక్, రికార్డింగ్ పరికరాలను అనుమతించరు. అధికారింగా లెక్కింపు ప్రక్రియను రికార్డు చేసే వీడియో కెమెరా తప్ప ఇతర వీడియో, ఫోటో కెమెరాలకు కూడా అనుమతి ఉండదు. కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌంటింగ్‌ జరగనుంది.

ఓట్ల లెక్కింపుపై పోలీసులకు డీజీపీ కీలక సూచనలు - ఆ విషయంలో అలెర్ట్​గా ఉండాలంటూ ఆదేశాలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి - ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జిల్లా వాసులు

ABOUT THE AUTHOR

...view details