Telangana Assembly Election Polling Percentage 2023 : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 71.34 శాతం పోలింగ్(Telangana Election Polling) నమోదైంది. రాష్ట్రంలో మొత్తం 3,26,02,793 మంది ఓటర్లు ఉండగా గురువారం నాటి పోలింగ్‌లో 2,32,59,256 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 1,15,84,728 మంది పురుషులు.. 1,16,73,722 మంది మహిళలు, 806 మంది ఇతరులు ఉన్నారు. పోలింగ్ రోజు అక్కడక్కడ చెదురుమదురు ఘర్షణలు మినహా ప్రశాంతంగా ఓటింగ్ జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల వారీగా చూస్తే అత్యధికంగా మునుగోడు(Munugodu)లో 91.89 శాతం ఓటింగ్ జరిగింది. పాలేరులో 90.89, ఆలేరులో 90.77 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా యాకుత్ పురాలో కేవలం 39.64 శాతం ఓటర్లు మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. మలక్ పేట్లో 41.32 శాతం, చార్మినార్‌లో 43.27 శాతం, చాంద్రాయణగుట్టలో 45.26 శాతం ఓటింగ్ నమోదైంది. బహదూర్ పురాలో 45.50 శాతం, జూబ్లీహిల్స్ లో 47.49 శాతం, శేరిలింగంపల్లిలో 48.75 శాతం, ఎల్బీనగర్లో 49.07శాతం, కంటోన్మెంట్లో 49.36 శాతం పోలింగ్ జరిగింది. జిల్లాల వారీగా చూస్తే యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 90.36 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో కేవలం 47.88 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. మేడ్చల్ - మల్కాజ్ గిరిలో 56.17 శాతం, రంగారెడ్డిలో 59.94 శాతం, హన్మకొండలో 68.81శాతం ఓటింగ్ జరిగింది.
తెలంగాణలో 70.79% పోలింగ్ - మళ్లీ పట్నం బద్ధకించింది - పల్లె ఓటెత్తింది
హైదరాబాద్‌లో ఆంక్షలు - ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : హైదరాబాద్-సికింద్రాబాద్ పరిధిలోని కౌంటింగ్ కేంద్రాల(Counting Stations) వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలకు కి.మీ దూరంలో భేటీలు, గుమిగూడటం నిషేధమని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఊరేగింపులు చేయవద్దని కోరారు. కేంద్రాల వద్ద కర్రలు, జెండాలు, ఆయుధాలతో సంచరించడం నిషేధమన్నారు. పాటలు పాడటం, స్పీకర్లు వినియోగించడం చేయకూడదని వివరించారు. ప్లకార్డులు, ఇతర గుర్తులు, ఫొటోలు ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో టెంట్లు, షామియానాలు వేయడం నిషేధమన్నారు. జంట నగరాల్లో మైకులతో ప్రచారాన్ని చేస్తే కఠిన చర్యలు తప్పమని హెచ్చరికలు జారీ చేశారు. ఈనెల 3న ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు ఉంటాయని సీపీ సందీప్ శాండిల్య తెలిపారు.
EC Vikas Raj about Vote Counting Arrangements in Telangana :ఆదివారం ఓట్ల లెక్కింపు రోజు మొదటి ఆధిక్యం ఉదయం పదిన్నర ప్రాంతంలో తెలిసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్(VikasRaj) తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు వివరించారు. లెక్కింపు కేంద్రాల వద్ద 40 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించినట్లు తెలిపిన సీఈఓ, స్ట్రాంగ్ రూంల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 1,766 లెక్కింపు టేబుళ్లు, 131 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఉంటాయని తెలిపారు. ఆరు నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, అక్కడ 28 టేబుళ్లు ఉంటాయని వికాస్‌రాజ్ చెప్పారు. మొదట 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం అవుతుందని, ఎనిమిదిన్నరకు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని అన్నారు.
ఓట్ల లెక్కింపు వాయిదా- ఆదివారం కాదట- మరి ఎప్పుడంటే?
అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం - స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచిన ఈవీఎంలు