Tejashwi Yadav Wedding: ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు, బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఓ ఇంటివాడయ్యాడు. హిందూ సంప్రదాయం ప్రకారం దిల్లీకి చెందిన రేచల్(రాజేశ్వరీ యాదవ్)తో ఆయన వివాహం జరిగింది. దిల్లీలో అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకకు ఎస్పీ అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ దంపతులు, రాజ్యసభ ఎంపీ మీసా భారతి సహా పలువురు ప్రముఖులు, నేతలు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. పలువురు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Tejashwi Yadav: ఘనంగా తేజస్వీ యాదవ్ వివాహం.. అఖిలేశ్ హాజరు - లాలూప్రసాద్ యాదవ్ న్యూస్
Tejashwi Yadav Marriage: బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ వివాహం ఘనంగా జరిగింది. వీరి పెళ్లి వేడుకలకు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
తేజస్వీయాదవ్ వివాహం
Tejashwi Yadav Marriage: తేజస్వీ సోదరి రోహిణి ఆచార్య పెళ్లి ఫొటోలను ట్వీట్ చేసి.. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. వాస్తవానికి నేడు నిశ్చితార్థం అని వార్తలు రాగా.. మంగళవారం రాత్రే కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ తంతును పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు వేడుక నేపథ్యంలో వేదిక ప్రాంగణం బయట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రవేశమార్గాల వద్ద పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టాకే, లోపలికి అనుమతించారు.
ఇవీ చదవండి: