Teenager Playing Guitar Blindfolded : గిటార్ వాయించడంలో ఎనలేని ప్రతిభను కనబరుస్తున్నాడు బంగాల్‌కు చెందిన ఓ టీనేజర్. చదివేది ఎనిమిదో తరగతే అయినా.. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. కేవలం గంటా 8 నిమిషాల్లోనే 25 పాటలను గిటార్‌తో ప్లే చేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కాడు. అది కూడా కళ్లకు గంతలు కట్టుకుని వాయించడం విశేషం. రెండేళ్ల క్రితం 30 నిమిషాల్లోనే 15 పాటలను గిటార్‌తో ప్లే చేసి.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించాడు.
Boy Plays Guitar Enters Asia Book of Records :ముర్షిదాబాద్ జిల్లాలోని బెర్హంపుర్ పరిధిలో ఉన్న ఇంద్రప్రస్థ ప్రాంతానికి చెందిన స్వస్రిక్ కర్మాకర్‌కు.. చిన్నప్పటి నుంచి గిటార్ వాయించడం అంటే చాలా ఇష్టం. దాన్నే అభిరుచిగా మలుచుకున్న స్వస్రిక్.. గిటార్ వాయించడాన్ని బాగా సాధన చేశాడు. అనంతరం తన ప్రతిభతో వివిధ అవార్డులను గెలుచుకున్నాడు. మరెన్నో మెడల్స్, ప్రశంస పత్రాలు అందుకున్నాడు స్వస్రిక్.
"స్వస్రిక్ చిన్నతనంలో ఉన్నప్పుడు ఓ దారం తీసుకుని దానితో ట్యూన్లు ప్లే చేస్తుండేవాడు. అతనిలోని ప్రతిభను గుర్తించిన నేను.. మా అబ్బాయికి ఓ గిటారు కొనిచ్చాను. పాఠశాలకు వెళ్లి తిరిగొచ్చిన వెంటనే.. కొద్ది సేపు గిటారుతో సాధన చేసేవాడు స్వస్రిక్. అనంతరం వివిధ రకాలుగా దాన్ని ప్లే చేయడం మొదలుపెట్టాడు. నా కొడుకు ప్రతిభను ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ రికార్డ్స్ ప్రతినిధులు గుర్తించడం.. నాకు చాలా గర్వంగా ఉంది."