తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాలికపై ఓ ఉన్మాది అత్యాచారయత్నం.. ఆపై కిరోసిన్​​ పోసి - ఉత్తర్​ప్రదేశ్​లో బాలికకు కిరోసిన్​తో నిప్పు

ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై ఓ ఉన్మాది అత్యాచారయత్నం చేశాడు. నిరాకరించిన బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని పీలీభీత్​ జిల్లాలో జరిగింది.

teenager burnt alive after failing in rape in pilibhit
teenager burnt alive after failing in rape in pilibhit

By

Published : Sep 10, 2022, 11:04 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 17 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడో ఉన్మాది. బాలిక ప్రతిఘటించడం కారణంగా ఆమె ఒంటిమీద కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ నెల 7వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీలీభీత్ జిల్లాలో మాధోతండా పోలీస్​ స్టేషన్​ పరిధిలో 17 ఏళ్ల బాలిక నివాసం ఉంటోంది. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన రాజ్​వీర్​ అనే యువకుడు బాలికపై అత్యాచార యత్నం చేశాడు. అందుకు బాలిక ప్రతిఘటించడం వల్ల ఆమెపై కిరోసిన్​ పోసి నిప్పంటించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చతిత్స పొందుతోంది.

అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్​గా మారింది. ఇందులో ఇద్దరు నిందితులు తనపై దాడి చేసినట్లుగా బాలిక ఆరోపించింది. ఈ వీడియో వైరల్​ కావడం వల్ల జిల్లా ఎస్పీ, ఏఎస్పీ స్పందించారు. ఆస్పత్రిలో ఉన్న బాలికను పరామర్శించారు. ఈ ఘటనపై తమకు సమాచారం అందిందని ఎస్పీ చెప్పారు. దర్యాప్తు ప్రారంభించామని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:భార్యతో అసహజ రీతిలో శృంగారం.. రివాల్వర్​తో బెదిరించి చివరకు..

ఏడేళ్ల బాలికపై రేప్​.. యువకుడిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన వృద్ధుడు

ABOUT THE AUTHOR

...view details