Teenage Girl Raped: మహారాష్ట్ర ఠాణె జిల్లాలో దారుణం జరిగింది. తన ఇంట్లో పని చేసే బాలికపై గత ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు యజమాని(60). పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
బాధితురాలి తండ్రి చనిపోయాడు. తల్లితో కలిసి జీవిస్తోంది. నిందితుని ఇంట్లో పనులు చేస్తూ.. పశువుల కాపరిలాగా జీవనంసాగిస్తోంది. ఈ క్రమంలో బాలిక(14)పై గత మే నుంచి అత్యాచారానికి పాల్పడ్డాడు యజమాని. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని బెదిరించాడు. బాలిక తల్లి విషయం తెలుసుకుని పొరుగింటి వారికి విషయం చెప్పింది. వారి సహకారంతో స్థానిక సామాజిక సంస్థను సంప్రదించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితున్ని అరెస్టు చేశారు.