మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో దారుణం జరిగింది. 17 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు కామాంధులు. నిందితుల్లో ఓ మైనర్ ఉన్నాడు. నిందితులందర్ని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..టీనేజర్‌పై శుక్రవారం ఓ వ్యవసాయ క్షేత్రంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు నిందితులు. బాధితురాలి తల్లిదండ్రులు శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మైనర్ నిందితుడిని జువైనల్ హోంకు తరలించారు. మిగతా నిందితుల్ని కోర్టులో హాజరుపరిచారు. ఐదుగురు నిందితులకి ఆగస్టు 17 వరకు పోలీసు కస్టడీ విధించింది కోర్టు.
మైనర్‌పై గ్యాంగ్ రేప్..
మరోవైపు, కేరళలో మైనర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు కామాంధులు. ఈ ఘటన త్రిస్సూర్‌లో జరిగింది. నిందితుల్లో ఒకర్ని పోలీసులు అరెస్టు చేశారు. మిగతా ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితులపై పోలీసులు పోక్సో చట్టం కిందకేసు నమోదు చేసుకున్నారు. రెండు నెలల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి తన బిడ్డపై జరిగిన దారుణాన్ని ఎవరకి తెలియనివ్వలేదు. ఇటీవల బాధితురాలు తన టీచర్‌తో జరిగిన దారుణాన్ని చెప్పింది. దీంతో ఈ విషయం బయటపడింది. నిందితులు.. బాధితురాలి తండ్రికి స్నేహితులు. నిత్యం బాధితురాలు ఇంటికి వస్తూ ఉండేవారు. వీరందరూ కలిసి గంజాయి వ్యాపారం చేస్తుండేవారు.