ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో పాశవిక ఘటన వెలుగు చూసింది. అలీగఢ్‌లోని గాంధీ పార్క్ సమీప రైల్వే ట్రాక్‌పై అత్యాచారానికి గురైన మైనర్ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు మంగళవారం పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ముగ్గురు అనుమానితులపై కేసు నమోదు చేసి, ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ జరిగింది..
హర్దువాగంజ్కు చెందిన 15-16 ఏళ్ల బాలిక ఆదివారం ఉదయం అదృశ్యమైంది. ఈ తరుణంలో కిడ్నాపర్లు 5 లక్షలు డిమాండ్ చేస్తూ బాలిక కుటుంబ సభ్యులకు మెసేజ్ పంపారు. తాము చెప్పినంత డబ్బు ఇవ్వకపోతే బాధితురాలికి సంబంధించిన అసభ్యకరమైన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తామని బెదిరించారు.
ఈ నేపథ్యంలో సోమవారం బాధితురాలి కుటుంబ సభ్యులు గాంధీ పార్కు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం రైల్వే ట్రాక్‌పై బాలిక మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ముగ్గురు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితురాలి మృతదేహం వద్ద సూసైడ్ నోట్ ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మార్టానికి పంపామని అన్నారు.
ఇదీ చదవండి:బస్సుకు విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు దుర్మరణం