ఓ బాలికకు మాదకద్రవ్యాలిచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు కీచకులు. ఈ ఘటనలో సదరు బాలిక గర్భవతి అయింది. బాలిక ఇంటి పరిసరాల్లో నివసించే మహిళను ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా తేల్చారు పోలీసులు.
హరియాణాలో కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోన్న బాలికను ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆమె ఆరు నెలల గర్భవతి అని తేలింది. దీంతో తనపై జరిగిన లైంగిక దాడి గురించి బాలిక వివరించగా ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
డ్రగ్స్ ఇచ్చి..
తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో నిందితురాలైన మహిళ తనను బయటికి తీసుకెళ్లి.. వేరే మహిళ ఇంట్లో ఉంచేదని ఆ బాలిక పోలీసులకు వివరించింది. అక్కడ డ్రగ్స్ ఇచ్చి వేర్వేరు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడేవారని తెలిపింది.