ఉత్తర్ప్రదేశ్ పంచాయత్ ఎన్నికల విధులకు హాజరైన ఉపాధ్యాయులు, సిబ్బంది కొవిడ్ బారిన పడి మరణించటంపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. వారికి వైద్యసదుపాయం అందించలేక యూపీ సర్కార్ విఫలమైందని ఆరోపించారు. మృతుల గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందన్నారు.
అంతకుముందు కొవిడ్ మరణాలపై మాట్లాడిన యూపీ ప్రాథమిక శిక్షా సంఘ్ అధ్యక్షుడు డాక్టర్. దినేశ్ చంద్ర శర్మ.. యూపీ పంచాయత్ ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన వారిలో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 1,621 టీచర్లు, సిబ్బంది కొవిడ్ తో మరణించారని తెలిపారు.