Teachers Day 2023 Wishes and Quotes : మన రెండో రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను స్మరించుకుంటూ దేశంలో ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5 రోజున 'ఉపాధ్యాయ దినోత్సవం' (Teacher's Day) గా జరుపుకుంటున్నాం. 'భారతరత్న' డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక ఫిలాసఫర్, పండితుడు, రాజనీతిజ్ఞుడు కూడా. ఆయన 1962 నుంచి 1967 వరకు దేశానికి రాష్ట్రపతిగా సేవలు అందించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి అయ్యాక ఉపాధ్యాయ వృత్తికి గౌరవ సూచకంగా ఆయన జన్మదిన వేడుకలను జరుపుకోవడానికి అనుమతించాలని ఆయన విద్యార్థులు, స్నేహితులు అభ్యర్థించారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే.. తన పుట్టినరోజును కాకుండా.. ఉపాధ్యాయులందరినీ గౌరవించేలా 'ఉపాధ్యాయ దినోత్సవం(Teachers Day)'గా జరుపుకోవాలని సూచించారు. అప్పట్నించీ అదే అనవాయితీ కొనసాగుతూ వస్తోంది.
Best Teachers Day Quotes 2023 : భారత సమాజంలో ఉపాధ్యాయులకు విశేష స్థానం ఉంది. తల్లిదండ్రుల తర్వాత గురువునే దైవంగా కొలిచే సంస్కృతి మనది. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర.. గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః అని అంటారు. ఎందుకంటే.. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తారు. గురువులు ఆ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి.. వారిని సన్మార్గంలో నడిపించి.. వారి పురోగతికి బాటలు పరుస్తారు. రాజైనా, మంత్రైనా, ఇంజినీర్ అయినా, డాక్టర్ అయినా.. ఒక గురువుకు శిష్యుడే. పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడిగా, ఆచార వ్యవహారాలు నేర్పించే ఆచార్యుడిగా తన జ్ఞానాన్ని మరొకరికి పంచి వారి జీవితాల్లో వెలుగులు నింపుతూ ఇతరుల అభ్యున్నతికి పాటుపడే ప్రతి ఒక్కరూ గురువులే. సదా సర్వదా పూజ్యనీయులే.
Best Teachers Day Wishes 2023 : అందుకే.. అలాంటి గురువులను స్మరించుకుంటూ.. ఈ టీచర్స్ డే రోజున మీరు కూడా మీకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకు, జ్ఞానబోధ చేసిన గురువులకు నమస్కరించి వారికి శుభాకాంక్షలు తెలియజేయండి. అయితే.. వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా సింగిల్ వర్డ్‌లో "హ్యాపీ టీచర్స్ డే" అని కాకుండా.. మీ ప్రేమను, ఆప్యాయతను ప్రతిబింబించే కోట్స్ తో శుభాకాంక్షలు తెలపండి. ఇందుకోసం మేము ఇక్కడ కొన్నిప్రత్యేక Teachers Day Quotes, Teachers Day Wishes ఇచ్చాం. అవి మీ ఉపాధ్యాయులకు పంపి వారి ఆశీర్వాదాలు తీసుకోండి.
Teacher's Day : గురుశిష్యుల బంధం.. అమోఘం.. అద్వితీయం
Teachers Day 2023 Wishes in Telugu :
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 2023 :
"మీ వంటి గురువుల ప్రేమతోనే ఇంతగా ఎదిగాను. ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాకు ఎంతో సంతోషకరమైనది. మీ పాఠాలు నా హృదయం , మనస్సుపై శాశ్వతమైన ముద్ర వేశాయి గురువుగారు"
"నేర్చుకోవడం ఒక సంతోషకరమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో నా మనసుకు దగ్గరైన గురువుగారు మీరు. ఈ టీచర్స్ డే సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరే నా నిజమైన ప్రేరణ."
"విజ్ఞానాన్ని అందించడమే కాదు.. విలువలను, జీవిత పాఠాలను కూడా నేర్పారు. మీరు ప్రతి కోణంలో నాకు రోల్ మోడల్."
"మీ మార్గదర్శకత్వం నా జీవిత ప్రయాణానికే మార్గదర్శకంగా నిలిచింది. మీరు విద్యార్థుల భవిష్యత్తు పట్ల లోతైన శ్రద్ధ చూపే అసాధారణ గురువు. మీ శిష్యుడిగా ఉన్నందుకు గర్విస్తున్నాను"
"మీ విద్యార్థుల పట్ల మీ అవిరామ కృషి, అంకితభావం నిజంగా అభినందనీయం మాష్టారు. మా మనస్సులను మాత్రమే కాకుండా మా భవిష్యత్తును కూడా అద్భుతంగా తీర్చి దిద్దినందుకు సదా కృతజ్ఞుడిని."
"నాకు పుస్తక పాఠాలే కాదు.. జీవిత పాఠాలు కూడా నేర్పారు. పట్టుదల, కృషి విలువలను నేర్పి నన్ను ఇంత వాడిని చేశారు. మీ మార్గదర్శకత్వానికి ధన్యవాదాలు."
"మీ పాఠాలు తరగతి గదిని దాటి విస్తరించి ఉన్నాయి. నా విద్యా, వ్యక్తిగత ఎదుగుదలపై మీరు చూపిన ప్రభావం అసాధారణం. ఇది నేను జీవితాంతం గుర్తించుకుంటాను టీచర్."
"ఈ విశాల ప్రపంచంలో.. నక్షత్రాలను చేరుకునేంతగా.. నన్ను ప్రేరేపించిన గురువుగారికి నమస్సుమాంజలులు. నా సామర్థ్యంపై మీ నమ్మకం నా జీవితంలో చోదక శక్తిగా ఉంది"
Teachers Day : ప్రథమ నమస్కారం గురువుకే ఎందుకో తెలుసా?
Teachers Day 2023 Quotes in Telugu :
తెలుగులో ఉపాధ్యాయ దినోత్సవ కోటేషన్లు 2023 :
"మన గురించి ఆలోచించడంలో సహాయపడేవారే నిజమైన ఉపాధ్యాయులు."- సర్వేపల్లి రాధాకృష్ణన్