తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్కూటీనే స్కూల్​గా మార్చి.. పేదలకు విద్య అందించి..

కరోనా కాలంలో విద్యా బోధన మొత్తం ఆన్​లైన్​ ద్వారానే సాగుతోంది. వైరస్​ ముప్పు లేకుండా ఇంటి నుంచే పాఠాలు నేర్చుకోవడం బాగానే ఉన్నా... పేద, గ్రామీణ విద్యార్థులకు మాత్రం పెద్ద సవాలుగా మారింది. స్మార్ట్ ఫోన్​లు, అంతర్జాలం అందుబాటులో లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ఇలాంటి వారి కోసం స్కూటీనే పాఠశాలగా మార్చి ఉచితంగా విద్య అందిస్తున్నారు ఓ ఉపాధ్యాయుడు.

school on scooty
స్కూల్ ఆన్ స్కూటీ

By

Published : May 13, 2021, 6:41 PM IST

స్కూల్ ఆన్ స్కూటీ

కరోనా మహమ్మారి వ్యాపారం నుంచి విద్యా వ్యవస్థ వరకు ప్రతి రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. పాఠశాలలు మూసివేయడంతో ఆన్‌లైన్ తరగతులే ఆధారమయ్యాయి. అయితే పేద కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన పిల్లలకు ఆన్‌లైన్ సదుపాయం లేకపోవటంతో వారంతా చదువుకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ధనిక పిల్లలు మాత్రమే ఆన్‌లైన్‌లో చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిరుపేద విద్యార్థులకు స్కూల్ ఆన్ స్కూటీ ద్వారా విద్యను చేరువ చేస్తున్నాడు.. మధ్యప్రదేశ్‌ సాగర్‌కు చెందిన ఉపాధ్యాయుడు చంద్రహాస్ శ్రీవాస్తవ.

"కరోనా విపత్కర పరిస్థితుల్లో సార్ మా గ్రామానికి వస్తున్నారు. పాఠాలు బోధిస్తున్నారు. గణితం సహా అన్ని సబ్జెక్టుల్ని నేర్చుకుంటున్నాం. యోగా ఎలా చేయాలో కూడా సార్‌ చెబుతున్నారు."

-కేశవ్, విద్యార్థి

స్కూటర్ మీద వచ్చే ఈ మాస్టర్, స్కూటర్‌పై ఆయన నిర్వహించే పాఠశాల గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఇది చాలా మందికి ఆశ్చర్యంగా.. అద్భుతంగా కనిపిస్తోంది.

"సాధారణ రోజుల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు బిచోరా గ్రామంలో ఉపాధ్యాయుడిగా విధులకు హాజరవుతాను. తరువాత ఖాళీ సమయంలో ఇంటి దగ్గర ఉన్న పిల్లలు, సమీప గ్రామాల విద్యార్థులకు పాఠాలు నేర్పిస్తాను. 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వేర్వేరు ప్రాంతాల్లో అర గంట నుంచి ఒక గంట సమయం బోధనకు కేటాయిస్తాను."

-చంద్రహాస్ శ్రీవాస్తవ, ఉపాధ్యాయుడు

చంద్రహాస్ శ్రీవాస్తవ దాదాపు ఏడాది నుంచి ఈ గ్రామానికి వస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల మూసివేసిన తరువాత నుంచి ఈ స్కూటీ పాఠశాల నిర్వహిస్తున్నారు. కరోనా కాలంలో పాఠశాలకు వెళ్లని పేద పిల్లలకు చదువు నేర్పించడమే ఆయన లక్ష్యం.

"నా దృష్టింతా.. సరైన సౌకర్యాలు అందుబాటులో లేని పేద పిల్లలపైనే. వారికి నోట్‌ బుక్స్‌, పుస్తకాలు, పెన్నులు,పెన్సిల్స్ పంపిణీ చేస్తాను, తద్వారా వారు చదువుకోగలరు."

-చంద్రహాస్ శ్రీవాస్తవ,ఉపాధ్యాయుడు

ప్రతి ఇంటి నుంచి పిల్లలు ఒక నిర్దిష్ట సమయంలో తరగతులకు హాజరవుతారు. కూర్చునేందుకు మ్యాట్స్ లేదా చాపలు తెచ్చుకుంటారు. మొబైల్ ఫోన్‌ ద్వారా చంద్రహాస్‌ చెప్పే పాఠాల్ని ఉత్సాహంతో చూస్తుంటారు. ఈ పేద పిల్లల కోసం, మాస్టర్ చంద్రహాస్ సొంతగానే ఖర్చు చేస్తున్నారు.

ఇదీ చదవండి:సర్వ మతాల సారాన్ని చెప్పే.. మాముని ఖాతూన్

"రోజూ బోధించడానికి వెళ్లే గ్రామంలో ఒక ఆవిష్కరణ చేస్తాను. ఎందుకంటే అక్కడ మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేదు. అందుకే నా స్కూటీలో లైబ్రరీ తయారు చేశాను. సొంత ఖర్చుతో గ్రీన్ బోర్డ్ తయారు చేశాను. 500 పుస్తకాలు సేకరించాను. వాటిని పిల్లలకు ఇస్తాను. 4 నుంచి 5 రోజుల్లో పిల్లలు పుస్తకాలను చదివి తిరిగి ఇస్తారు. గ్రీన్ బోర్డ్‌లో పాఠాలు నేర్పిస్తాను."

-చంద్రహాస్ శ్రీవాస్తవ, ఉపాధ్యాయుడు

పిల్లలకు పాఠాలు చెబుతూనే మధ్యలో గ్రామ ప్రజలతో మాట కలుపుతున్నారు.. చంద్రహాస్‌. విద్య చిన్నారులకు ఎంత ముఖ్యమో వారికి అర్ధమయ్యేలా వివరిస్తున్నారు. స్కూల్ ఆన్ స్కూటీ వేదికను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉపయోగపడే పాఠశాలగా మార్చడానికి గట్టిగా సంకల్పించుకున్నారు ఈ మాస్టారు. ఆయన కృషిని గుర్తించి గ్రామస్తులు కూడా మద్దతు ఇస్తున్నారు.

ఇదీ చదవండి:పిల్లల ఉన్నత చదువుకు 'రేఖ' పొదుపు పథకం

"సార్ వస్తారు, మా పిల్లలకు పాఠాలు చెప్తారు. పుస్తకాలు ఇస్తారు. పిల్లలు ఇలాంటి పరిస్థితుల్లో ఖాళీగా కూర్చోరు. చక్కగా చదువుతారు."

-క్రాంతి యాదవ్, స్థానికురాలు

చంద్రహాస్‌ బోధించే విధానం కొంచెం ప్రత్యేకం. వివిధ ఆటలు, క్రీడా కార్యకలాపాలను బోధనా విధానంలో భాగం చేస్తుంటారు. ఇది పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఆయన పాఠాలు చెబుతున్నప్పుడు పిల్లలు ఆడుతున్నారా లేదా చదువుతున్నారా అని తెలుసుకోవడం అసాధ్యం. గ్రామ ప్రజలందరూ ఆయనను తమ పిల్లల పాలిట దైవదూతగా భావిస్తుంటారు.

"మొదట పిల్లలను బుందేల్‌ఖండ్‌లోని ఘర్ హమారా విద్యాలయలో రాష్ట్ర విద్యా శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమానికి తీసుకువెళతాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ లైబ్రరీని మరింత పెంచుతాను."

-చంద్రహాస్ శ్రీవాస్తవ,ఉపాధ్యాయుడు

ఇవీ చదవండి:పర్యావరణంపై ప్రేమతో.. 'పేపర్​ మాస్క్​'

ఐకమత్యంతో అగ్నిప్రమాదాలకు చెక్ పెట్టారిలా..

క్రికిట్​ బ్యాటే ఆశాకిరణం- లాక్​డౌన్​లో లాభాల బాట!

ABOUT THE AUTHOR

...view details