తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాపీ కొడుతుందని బాలిక బట్టలు విప్పించిన టీచర్​.. అవమానంతో ఆత్మహత్యాయత్నం! - విద్యార్థినిపై టీచర్ దారుణం

ఝార్ఖండ్​లో ఓ టీచర్​.. విద్యార్థిని పట్ల దారుణంగా ప్రవర్తించింది. పరీక్షల్లో కాపీ కొడుతుందనే అనుమానంతో బట్టలు విప్పి తనిఖీ చేసింది. అయితే బాధితురాలు మనస్తాపానికి గురై ఇంటికి వెళ్లి ఒంటిపై ఆయిల్​ పోసుకుని నిప్పంటించుకుంది.

teacher took off girl clothes
విద్యార్థిని బట్టలు విప్పించిన మహిళా టీచర్

By

Published : Oct 14, 2022, 10:53 PM IST

Updated : Oct 14, 2022, 11:00 PM IST

ఝార్ఖండ్​ జంషెద్​పుర్​లో అమానవీయ ఘటన జరిగింది. పరీక్షల్లో కాపీ కొడుతోందని అనుమానించిన ఓ మహిళ టీచర్​ బాలిక బట్టలు విప్పించింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన బాలిక ఇంటికి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఒంటిపై ఆయిల్ పోసుకుని నిప్పంటించుకుంది. దాదాపు 80 శాతం కాలిన గాయాలతో ఉన్న బాలికను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అనంతరం బాలిక పరిస్థితి విషమించడం వల్ల టాటా ఆస్పత్రికి తీసుకెళ్లారు.

బాధితురాలు.. ఛాయనగర్​లోని స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. శుక్రవారం మధ్యాహ్నం బాలిక పరీక్ష రాయడానికి పాఠశాలకు వెళ్లింది. ఈ సమయంలో బాలిక కాపీ కొడుతుందని చంద్ర అనే టీచర్​ అనుమానించింది. ఈ క్రమంలో బాలికను మరో గదిలోకి తీసుకెళ్లి బట్టలు విప్పి తనిఖీ చేసింది. దీంతో బాలిక మనస్తాపానికి గురై.. సాయంత్రం ఇంటికి వెళ్లి ఒంటిపై ఆయిల్ పోసుకుని నిప్పంటించుకుంది. మహిళా ఉపాధ్యాయురాలు వల్లే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని బాధితురాలు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై గ్రామస్థులు మండిపడుతున్నారు.

Last Updated : Oct 14, 2022, 11:00 PM IST

ABOUT THE AUTHOR

...view details