Teacher tested positive for Covid: దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి కలవరపెడుతోంది. మహారాష్ట్రలోనూ ఈ వేరియంట్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఔరంగాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్‌కు కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది.
సరస్వతి భువన్ స్కూల్ టీచర్ డిసెంబర్ 21న కరోనా బారిన పడిన కారణంగా పాఠశాలను కొద్ది రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఔరంగాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారి వెల్లడించారు. డిసెంబర్ 27 వరకు పాఠశాలకు సెలవు ప్రకటించినట్లు స్పష్టం చేశారు.
"టీచర్‌కు స్వల్పంగా కొవిడ్ లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారు. ఆయనతో సన్నిహితంగా మెదిలినవారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించాం. ప్రస్తుతం సోమవారం వరకు పాఠశాలకు సెలవు ప్రకటించాం." అని ఏఎంసీ డిప్యూటీ కమిషనర్ సంతోష్ తెంగ్లే పేర్కొన్నారు.
23 కొత్త కేసులు..