తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కదిలే లైబ్రరీ' ఈ మనసున్న మాస్టారు - మధ్యప్రదేశ్​ సాగర్​ జిల్లా వార్తలు

సాధారణంగా ఉపాధ్యాయులు పాఠాలు మాత్రమే బోధిస్తారు. కానీ కొందరూ మాత్రం అందరిలో స్ఫూర్తిని నింపుతారు. తన సేవా నిరతితో ఓ ఉపాధ్యాయుడు ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా కారణంగా చదువులకు దూరమైన విద్యార్థులకోసం ఆయన తన స్కూటర్‌ను లైబ్రరీగా మార్చారు. ఊరూరు తిరుగుతూ విద్యాబుద్ధులు నేర్పుతున్న మనసున్న మాస్టార్‌పై ప్రత్యేక కథనం.

teacher runs mobile school, స్కూటర్​ని లైబ్రెరీ గా మార్చిన టీచర్
కదిలే లైబ్రరీ

By

Published : Mar 29, 2021, 3:45 PM IST

Updated : Mar 29, 2021, 4:48 PM IST

శ్రీవాస్తవపై ప్రత్యేక కథనం

పిల్లలకు చక్కని అనుకరణలతో పాఠాలు బోధిస్తున్న ఈ ఉపాధ్యాయుడి పేరు శ్రీవాస్తవ. సాగర్‌ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌తో చదువులకు దూరమైన విద్యార్థుల కోసం వినూత్న ప్రయత్నం చేశారు. తాను రోజు ఉపయోగించే స్కూటర్‌నే గ్రంథాలయంగా మార్చారు. సాగర్ జిల్లాలోని ఊరూరు తిరుగుతూ పిల్లలకు విద్యాబోధన చేస్తున్నారు. వారికి అనేక పద్ధతుల్లో విద్యాబుద్ధులు నేర్పుతున్నారు

కరోనా కారణంగా సాగర్‌ జిల్లాలో ప్రభుత్వ బడులు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు ఆదేశాలు జారీచేసింది. కానీ స్మార్ట్ ఫోన్లు, ఇంటర్‌ నెట్ సదుపాయం లేనివారి కోసం ఈ మనసున్న మాస్టర్‌ ఓ ఉపాయం ఆలోచించారు. తన స్కూటర్‌ను గ్రంథాలయంగా మార్చారు. ప్రాథమిక విద్యకు కావాల్సిన అన్ని పుస్తకాలను ఆ లైబ్రరీలో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమకు కావాల్సిన పుస్తకాలను గ్రంథాలయం నుంచి తీసుకుని రెండు నుంచి మూడు రోజుల వరకు తమ వద్దే ఉంచుకోవచ్చు. అంతేకాదు విద్యార్థుల కోసం ఐదు స్మార్ట్‌ ఫోన్లు కూడా కొనుగోలు చేశారు. పాఠం చెబుతున్న సమయంలో వాటిని విద్యార్థులకు అందించి వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు.

శ్రీవాస్తవ మాస్టార్ ఆలోచనలను సాగర్‌ జిల్లాలోని గ్రామస్థులు అభినందిస్తున్నారు. చిల్లిగవ్వ తీసుకోకుండా విద్యాబోధన చేస్తున్న మాస్టర్‌ను నువ్వు గ్రేట్‌ అంటూ ప్రశంసిస్తున్నారు.

ఇదీ చదవండి :పళనిస్వామి 'పాంచ్ పటాకా' మోగించేనా?

Last Updated : Mar 29, 2021, 4:48 PM IST

ABOUT THE AUTHOR

...view details